ETV Bharat / international

బైడెన్​ ప్రమాణ స్వీకారానికి జార్జి​ బుష్​ - former first lady Rosalynn Carter

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. అధికార బదిలీకి బెట్టు చేస్తున్న తరుణంలో బుష్​ ఈ కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం.​

Former President George Bush to attend Biden inauguration
బైడెన్​ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న జార్జి​ బుష్​
author img

By

Published : Jan 6, 2021, 8:30 PM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ​ బుష్​ హాజరుకానున్నారు. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమానికి బుష్​ తన భార్య అమెరికా మాజీ మొదటి మహిళ లారా బుష్​తో సమేతంగా విచ్చేస్తారని బుష్​ ప్రతినిధి తెలిపారు. బుష్​ పాల్గొననున్న 8వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇది. అంతకుముందు అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​.. ప్రమాణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

అధికార బదిలీకీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ససేమిరా అంటున్న తరుణంలో రిపబ్లికన్​ పార్టీకి చెందిన నేత అయిన బుష్​.. ఈ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొననుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జార్జి​ డబ్ల్యూ బుష్​ హాయాంలో విదేశీ వ్యవహారాల కమిటీకీ ఛైర్మన్​గా ఉన్న బైడెన్.. భారత్​తో అమెరికా కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందానికి మద్దతు తెలిపారు.

మొదటిసారి హాజరు కాలేకపోతున్న జిమ్మీ కార్టర్​..

బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్​, ఆయన భార్య మాజీ మొదటి మహిళ రోసల్యాన్​ కార్టర్​ హాజరు కావట్లేదని తెలుస్తోంది. 1977లో అమెరికా 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన 96 ఏళ్ల జిమ్మీ కార్టర్​.. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత హాజరుకాని మొదటి అధ్యక్ష ప్రమాణ స్వీకార వేడుక ఇదే.

కరోనా వైరస్​ ప్రభావం దృష్ట్యా.. జార్జియాలోని ప్లెయిన్స్​ నివాసంలోనే జిమ్మీ కార్టర్​ దంపతులు గడుపుతున్నారు.

ఇదీ చూడండి:క్లైమాక్స్​కు 'అధ్యక్ష పోరు'- ట్రంప్​ ట్విస్ట్ ఇస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.