ETV Bharat / international

అమెరికాలో విదేశీ విద్యార్థుల పాట్లు- హార్వర్డ్ న్యాయ పోరు - us immigration

ఆన్​లైన్​ శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులను వెనక్కి పంపించే విధంగా జారీ చేసిన నూతన నిబంధనల కారణంగా విద్యార్థుల్లో భయాందోళనలు అధికమయ్యాయి. ఈ అనూహ్య నిర్ణయంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు విద్యార్థులు. వీసా వదులుకోవడమా, లేదంటే బయటకు వచ్చి కరోనాను ఎదుర్కోవడమా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఈ ఆదేశాలు నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది హార్వర్డ్ విశ్వవిద్యాలయం.

Foreign students weigh studying in person vs. losing visas
అమెరికాలో విదేశీ విద్యార్థుల పాట్లు- హార్వర్డ్ న్యాయ పోరు
author img

By

Published : Jul 10, 2020, 9:39 PM IST

ఆన్​లైన్ క్లాసులకు హాజరయ్యేవారిని దేశం నుంచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనతో అక్కడి విదేశీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నూతన ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ కోర్సుల్లో చేరి కరోనా బారినపడటమా..లేదా అమెరికా వీసా వదులుకోవడమా అని తర్జనభర్జన పడుతున్నారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ ప్రణాళికలన్నీ చెల్లాచెదురయ్యాయని చాలా మంది విద్యార్థులు వాపోతున్నారు. భారత్​ సహా చైనా బ్రెజిల్ దేశాలకు చెందిన విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. కొంతమంది విద్యార్థులు కెనడా వెళ్లేందుకు యత్నిస్తున్నారు.

"నేను పరిశోధన చేస్తున్నాను.​ అంతేగాక గొప్ప ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నాను. ఐదేళ్ల నా పీహెచ్​డీ ప్రోగ్రామ్​లో ఇప్పుడు మూడో సంవత్సరంలో ఉన్నాను. ఒకవేళ నేను టర్కీకి వెళ్లిపోతే అక్కడ ఈ పీహెచ్​డీ అందుబాటులో ఉండదు. కాబట్టి నా ప్రతిభకు ప్రశంసలు లభించే చోటుకు నేను వెళ్లాలనుకుంటున్నాను."

-బతుహన్ మెకికెర్, అమెరికాలో చదువుతున్న టర్కీ విద్యార్థి, మోంటనా యూనివర్సిటీ

అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్​లో పీహెచ్​డీ చేస్తున్న జస్దీప్ మండియా (భారత్​)... ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులపై యూనివర్సిటీలు కాస్త శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలు మాత్రం అస్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఫ్రాన్స్​కు చెందిన ఓ విద్యార్థి తిరిగి తన దేశానికి వెళ్లిపోనున్నట్లు చెప్పుకొచ్చాడు. తన కారును అమ్మేసుకున్నట్లు తెలిపాడు.

కోర్టులో వ్యాజ్యం

అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే అధిక ఫీజులు కట్టే విదేశీ విద్యార్థులే వీటి మనుగడకు కీలకంగా ఉన్నారు.

మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఇప్పటికే ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టుకు విన్నవించింది. కొందరు విద్యార్థులను పంపించడం ప్రారంభించామని తెలిపింది. ప్రస్తుతం దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా. అసంఖ్యాకమైన విదేశీ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.