ETV Bharat / international

శునకం కనిపించలేదని కాల్పులు- ముగ్గురు మృతి

అమెరికాలో ఓ శునకం కారణంగా ఇరుగు పొరుగు వారి మధ్య మొదలైన గొడవ హింసాత్మకంగా మారింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనలో ఓ 11 ఏళ్ల బాలిక సహా.. మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Florida police identify 3 killed in dispute over dog
శునకం తెచ్చిన పేచీ- మూడు ప్రాణాలు బలి!
author img

By

Published : Jul 10, 2020, 6:01 AM IST

అమెరికా ఫ్లోరిడాలో ఓ శునకం కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో ఆగ్రహానికి లోనైన కుక్క యజమాని అవతలి వ్యక్తితో సహా.. అతడి 11 ఏళ్ల కుమార్తెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం పోలీసుల ఎదురుకాల్పుల్లో అతనూ మరణించాడు.

ఏం జరిగిందంటే.?

పోర్ట్​ సెయింట్​ లూసీలో 82 ఏళ్ల డెల్సెరోకు ఓ పెంపుడు కుక్క ఉంది. అది పొరుగింట్లోని అలెగ్జాండర్​ హాన్స్​మన్​ భార్యను కరిచింది. ఫలితంగా వారు యానిమల్​ కంట్రోల్​ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు అధికారులు. ఇంతలో డెల్సెరోకు తన కుక్క కనిపించకపోవడం వల్ల ఆగ్రహానికి లోనయ్యాడు. చేతుల్లో రెండు తుపాకీలతో హాన్స్​మర్​ ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హాన్స్​మర్​ సహా.. అతడి 11 ఏళ్ల కుమార్తె హార్పర్​ మృతిచెందారు.

కాల్పుల సమయంలో హార్పర్​.. పోలీసుల అత్యవసర ఫోన్​ నెంబర్​కు కాల్​ చేసి, సాయం చేయాలని కోరింది. తమ ఇంట్లో పొరుగువారు కాల్పులు జరుపుతున్నారని రోదించింది. తక్షణమే స్పందించిన పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రెండో అంతస్తులో దాగి ఉన్న డెల్సెరోను పట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపైనా కాల్పులకు దిగాడు. బుల్లెట్​ ప్రూఫ్​ కోర్టు ఉన్నందున ఓ అధికారి ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు నిందితుడు.

ఇదీ చదవండి: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ- నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.