ETV Bharat / international

క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు - క్రిస్​మస్​ న్యూస్​

Flights cancellation omicron: ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పైలట్స్​, విమాన సిబ్బంది వైరస్​ బారినపడుతున్నారు. రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతోంది. దీంతో క్రిస్​మస్​ సెలవు రోజుల్లో నడిపే వందల విమానాలను రద్దు చేసినట్లు జర్మనీ, అమెరికాకు చెందిన మూడు ప్రధాన ఎయిర్​లైన్స్​ ప్రకటించాయి.

flight cancellation omicron
క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ
author img

By

Published : Dec 25, 2021, 12:16 AM IST

Flights cancellation omicron: ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణ విమానయాన సంస్థలపైనా పడింది. పండగ రోజుల్లో రద్దీ ప్రయాణాలతో వైరస్​ బారిన పడుతున్న విమాన సిబ్బంది పెరుగుతున్న నేపథ్యంలో మూడు ప్రధాన విమానయాన సంస్థలు డజన్ల కొద్ది విమానాలను​ రద్దు చేశాయి.

జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్​లైన్స్​ క్రిస్​మస్​ సెలవు రోజుల్లో డజన్​కుపైగా విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ​పైలట్స్, సిబ్బంది​ అనారోగ్యంతో సెలవులు పెట్టటమే అందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత పండగల సీజన్​లో పెద్ద సంఖ్యలో అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నప్పటీ హ్యూస్టన్​, బోస్టన్​, వాషింగ్టన్​కు విమానాలను నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, ఇందుకు కొవిడ్​-19 బారినపడటం, క్వారంటైన్​ కారణమా అనేది చప్పలేమని పేర్కొంది. వైరస్​ బారినపడినట్లు తమకు సిబ్బంది తెలియజేయలేదని పేర్కొంది.

ప్రస్తుత పండగ సీజన్​లో భారీగా అదనపు సిబ్బందిని నియమించుకున్నప్పటికీ.. అధిక సంఖ్యలో సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారని లుఫ్తాన్సా ప్రకటించింది. విమానాల రద్దుకు అదే ప్రధాన కారణమని పేర్కొంది.

జర్మనీలో మూడో దశ..!

కొద్ది రోజులుగా ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్రిస్​మస్​ పండగ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు ఆ దేశ ఆరోగ్య మంత్రి. ఒమిక్రాన్​ కారణంగా దేశంలో మరో దశ ఉద్ధృతి వస్తుందని భావిస్తున్నారు అక్కడి అధికారులు. అయితే, ప్రస్తుతానికి డెల్టా కేసులే అధికంగా ఉండటం గమనార్హం. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి కార్ల్​ లాటెర్​బాచ్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు. వైరస్​ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

అమెరికా విమానాలు సైతం..

ఒమిక్రాన్​ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడటం వల్ల డజన్ల కొద్ది క్రిస్​మస్​ ప్రత్యేక విమానాలను రద్దు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్​లైన్స్​, యునైటెడ్​ ఎయిర్​లైన్స్​లు ప్రకటించాయి. యునైటెడ్​ 169, డెల్టా 127 విమానాలను రద్దు చేసినట్లు తెలిపాయి.

"దేశవ్యాప్తంగా ఈ వారం ఒమిక్రాన్​ కేసులు పెరగటం మా కార్యకలాపాలను నిర్వహించే సిబ్బంది, విమాన సిబ్బందిపై నేరుగా ప్రభావం చూపింది. దాని ఫలితంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రభావితమైన ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తున్నాం. తిరిగి టికెట్​ బుకింగ్​ చేసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నాం."

- యునైటెడ్​ ఎయిర్​లైన్స్​.

ఇదీ చూడండి: బైడెన్​ కీలక నిర్ణయం- ఆ దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.