ఏప్రిల్ 6 వరకు శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. క్యాపిటల్ భవనం వద్ద శుక్రవారం జరిగిన కారు దాడిలో మృతిచెందిన పోలీసు అధికారి గౌరవార్థం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనలో మరో భద్రతా సిబ్బంది గాయపడగా, పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.
పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్ మృతి పట్ల బైడెన్ సహా యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్యాపిటల్, అక్కడ పనిచేసేవారు, దానిని సంరక్షించేవారికి ఇదో గడ్డుకాలమని బైడెన్ వ్యాఖ్యానించారు. దాడి పట్ల సత్వరం స్పందించిన క్యాపిటల్ పోలీసులు, నేషనల్ గార్డ్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎవన్స్ మృతి పట్ల ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సంతాపం తెలిపారు. మాటల్లో వర్ణించలేని హింసలో ఒక సాహసోపేతమైన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. క్యాపిటల్‌ను రక్షించడానికి అత్యున్నత త్యాగం చేశాడని కొనియాడారు.
ఇదీ చూడండి: బైడెన్ ఈస్టర్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన