ETV Bharat / international

Woman Cured of HIV: హెచ్​ఐవీ నుంచి మహిళకు విముక్తి!

author img

By

Published : Feb 17, 2022, 4:34 AM IST

Woman Cured of HIV: మూలకణ మార్పిడి చికిత్సతో ఓ మహిళ హెచ్​ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందిన తొలి మహిళ ఆమెనే కావడం విశేషం. ఇంతకీ ఇది ఎలా సాధ్యపడిందంటే?

Woman Cured of HIV
hiv cure

Woman Cured of HIV: హెచ్​ఐవీ, ఎయిడ్స్​ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో అశావహ ముందడుగు! అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్​ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందినవారిలో ఆమె మూడో వ్యక్తి కాగా, మహిళల్లో మొదటివారు. 'రెట్రోవైరస్​లు-అంటువ్యాధులు'పై మంగళవారం నిర్వహించిన సందస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డ్​ స్టెమ్​సెల్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ విధానంలో హెచ్​ఐవీ నుంచి విముక్తి పొందవచ్చని నిర్ధారణకు వచ్చినట్టు వారు ప్రకటించారు.

జాన్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ, మెటర్నల్ పీడియాట్రిక్ ఆడోలెసెంట్ ఎయిడ్స్​ క్లినికల్ ట్రయల్ నెట్​వర్క్​ (ఇంపాక్ట్​), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కేసులో పరిశోధన సాగించారు. ఇంపాక్ట్​ సంస్థ 2015 నుంచి మొత్తం 25 మంది హెచ్​ఐవీ బాధితులపై పరిశోధనలు సాగిస్తోంది.

ఈ క్రమంలో నాలుగేళ్లుగా హెచ్​ఐవీతో బాధపడుతూ, యాంటీరిట్రోవైరల్ థేరపీ (ఏఆర్​టీ) తీసుకుంటున్న మహిళకు శాస్త్రవేత్తలు 2017లో కార్డ్​ బ్లడ్​ మూలకణ మార్పిడి చికిత్స అందించారు. వందరోజుల తర్వాత పలుమార్లు పరీక్షించగా, ఆమెలో అసలు హెచ్​ఐవీ జాడే కనిపించలేదు! దీంతో 37వ నెలలో ఏఆర్​టీ నిలిపివేశారు. కీమో థెరపీ ద్వారా తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా నుంచి కూడా ఆమెకు ఉపశమనం లభించడం విశేషం.

ఇదీ చూడండి: హెచ్ఐవీ బాధిత మహిళ శరీరంలో ఒమిక్రాన్ పుట్టుక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.