గోడ మధ్యలో చిక్కుకుని రెండు రోజులు నరకయాతన అనుభవించిన ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. అమెరికాలోని న్యూయార్లో ఈ ఘటన జరిగింది.
న్యూయార్క్ నగరంలోని ఓ థియేటర్ గోడ మధ్యలో నుంచి మనిషి అరుపులు వచ్చాయి. థియేటర్లో పనిచేసే ఉద్యోగులు యజమానికి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది గోడను బద్దలు కొట్టారు. అందులో నుంచి నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి బయటపడ్డాడు.
ఆ వ్యక్తికి 39 ఏళ్ల వయస్సు ఉంటుందని అగ్నిమాపక అధికారి జాన్ కేన్ తెలిపారు. బాత్రూమ్ గోడ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోకి ఆ వ్యక్తి అనుకోకుండా పడిపోయి ఉండవచ్చని తెలిపారు. బయటపడలేక రెండు రోజులపాటు అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు.
థియేటర్ పరిసర ప్రాంతంలోనే రెండు రోజుల పాటు ఆ వ్యక్తి తిరిగినట్లు థియేటర్ యజమాని తెలిపారు. బాత్రూమ్ వాడుకోవడానికి వెళ్లాడా? లేక వేడిగా ఉంటుందని ప్రయత్నించినప్పుడు పై నుంచి అనుకోకుండా పడిపోయాడా? తెలియదని చెప్పారు. మానసిక సమస్యతో ఆ వ్యక్తి బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి గాయాలు కానప్పటికీ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు- 19 మంది దుర్మరణం