ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో భగవద్గీతతో ప్రశాంతతను పొందొచ్చని అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలు తులసీ గబార్డ్ పేర్కొన్నారు. "రేపు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తియోగం, కర్మయోగాన్ని అనుసరించడం ద్వారా ప్రశాంతత, మనోబలాన్ని పొందొచ్చు" అని హిందూ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు. హిందూ విద్యార్థుల మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
"జీవితంలో మీరు కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్న తరుణంలో జీవిత పరమార్థమేమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భగవంతుడిని, భగవంతుడి సంతానాన్ని సేవించడం, కర్మయోగాన్ని అనుసరించడమే జీవిత పరమార్థమని మీరు గుర్తించగలిగితే విజయవంతమైన జీవనాన్ని మీరు గడుపుతారు." అని ఆమె చెప్పారు.
ఇదీ చూడండి: అమెరికాలో సిక్కు యువతి సరికొత్త చరిత్ర