ETV Bharat / international

నిషేధానికి కొద్ది గంటల ముందు టిక్​టాక్​కు ఊరట - tiktok ban latest news

చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్​టాక్​కు అమెరికా కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఆదివారం అమలు కావాల్సిన పాక్షిక నిషేధాన్ని వాయిదా వేస్తూ కొలంబియా ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది.

US-TIKTOK-JUDGE
టిక్​టాక్​
author img

By

Published : Sep 28, 2020, 8:07 AM IST

అమెరికాలో నిషేధానికి కొద్ది గంటల ముందు ప్రముఖ వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​కు ఊరట లభించింది. యాప్​ స్టోర్ల నుంచి టిక్​టాక్​ డౌన్​లోడ్​లపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వాయిదా వేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది.

జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణాలతో చైనాకు చెందిన టిక్​టాక్​పై నిషేధం విధిస్తూ.. ట్రంప్ ఈ ఏడాది ఆగస్టులో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్​ 27 నుంచి యాప్​ స్టోర్ల నుంచి టిక్​టాక్​ డౌన్​లోడ్​లు, అనంతరం నవంబర్ 12 నుంచి పూర్తి స్థాయి నిషేధం అమల్లోకి రానుంది.

అత్యవసర విచారణ..

నిషేధం ఉత్తర్వులపై ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది కొలంబియా కోర్టు. యాప్​పై నిషేధం విధించటం సంస్థ హక్కులను కాలరాయటమేనని టిక్​టాక్ తరఫు న్యాయవాదులు వాదించారు. జాతీయ భద్రత పేరుతో యాప్​పై నిషేధం విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టుకు విన్నవించారు.

ప్రభుత్వం వాదనలను విన్న తర్వాత నిషేధ ఉత్తర్వులను వాయిదా వేస్తున్నట్లు కొలంబియా ఫెడరల్ కోర్టు జడ్జి కార్ల్ నికోల్స్ తీర్పునిచ్చారు. అయితే, నవంబర్​లో నిషేధానికి సంబంధించిన ఆదేశాలను వాయిదా వేసేందుకు అంగీకరించలేదు.

ఇదీ చూడండి: టిక్​టాక్​పై నిషేధాన్ని అడ్డుకోవాలని కోర్టుకు వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.