ETV Bharat / international

'హైడ్రాక్సీ' వినియోగాన్ని నిలిపేసిన అగ్రరాజ్యం - chloroquine

కరోనా చికిత్సగా ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​(హెచ్​సీక్యూ), క్లోరోక్విన్(సీక్యూ)​ను అత్యవసర వినియోగం నుంచి ఉపసంహరించింది అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఐ. వైరస్​పై సమర్థంగా పోరాడలేవన్న కారణంతో వాటిపై ఈ నిర్ణయం తీసుకుంది.

hydraxi
'హైడ్రాక్సీ' వినియోగాన్ని నిలిపేసిన అగ్రరాజ్యం
author img

By

Published : Jun 16, 2020, 7:01 AM IST

కొవిడ్‌-19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సోమవారం తెలిపింది. కరోనా వైరస్‌పై చికిత్సలో ఈ మందులు సమర్థంగా వ్యవహరించే అవకాశం లేదని పేర్కొంది. వీటివల్ల కలిగే ప్రయోజనాల కన్నా ముప్పే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

దశాబ్దాల నాటి ఈ ఔషధాలను ప్రధానంగా మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయం వల్ల.. ఫెడరల్‌ ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాలను రాష్ట్ర, స్థానిక అధికారులకు పంపిణీ చేయడం కుదరదు.

మార్చి 28న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్​ను అత్యవసర వినియోగ ఔషధంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఎఫ్​డీఏ.

ఇదీ చూడండి: ట్రంప్ ప్రచార సభ వాయిదా.. ఆఫ్రో అమెరికన్ల డిమాండ్లే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.