ETV Bharat / international

'చిన్నారులపై ఆ టీకా పని తీరు భేష్​' - అమెరికా కరోనా

5-11ఏళ్ల వయస్సు గల పిల్లలకు కరోనా టీకా అందించాలని అమెరికా భావిస్తున్న(kids vaccine news) తరుణంలో ఎఫ్​డీఏ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలపై ఫైజర్​ టీకా(pfizer vaccine) సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫైజర్​ అందించిన డేటాను పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేసింది(us fda pfizer).

kids vaccine news
ఫైజర్​ టీకా
author img

By

Published : Oct 23, 2021, 10:57 AM IST

5-11 మధ్య వయస్సు గల పిల్లల వ్యాక్సినేషన్​ విషయంపై అమెరికా ఎఫ్​డీఏ(ఆహార, ఔషధ సంస్థ) కీలక ప్రకటన చేసింది(fda latest news). ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో వ్యాధి సోకకుండా ఫైజర్​ టీకా(us fda pfizer) సమర్థవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. పిల్లలకు టీకా పంపిణీ చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్న తరుణంలో ఎఫ్​డీఏ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఊరటనిచ్చే విషయం.

అమెరికాలో 5-11ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 28మిలియన్​ మంది ఉన్నారు(kids vaccine news). వారికి ఇచ్చేందుకు టీకాలు సిద్ధమేనా? అన్న అంశంపై వచ్చే వారంలో ఎఫ్​డీఏ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరగనుంది. ఈ తరుణంలో ఫైజర్ ఇచ్చిన​ డేటాను విశ్లేషించి, ఆ వివరాలను విడుదల చేసింది ఎఫ్​డీఏ.

ఏ పరిస్థితుల్లోనైనా.. చిన్నారులకు టీకా ద్వారా కలిగే సైడ్​ఎఫెక్ట్​ల కన్నా, వ్యాక్సిన్​ చేసే మంచే ఎక్కువగా ఉందని ఎఫ్​డీఏ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కొవిడ్​ సోకిన చిన్నారులు టీకా తీసుకుంటే చాలా సందర్భాల్లో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి రాదని, మరణం నుంచి కూడా రక్షణ లభిస్తుంది అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తలు ఇంత సానుకూలంగా ఉన్నా.. 5-11 మధ్య వయస్సు(pfizer kids vaccine) గల చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఎఫ్​డీఏ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. మంగళవారం జరగనున్న సమావేశంలో స్వతంత్ర సలహాదారులు కూడిన ప్యానెల్​ ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఎఫ్​డీఏ తుది నిర్ణయానికొస్తుంది.

ఒకవేళ ఎఫ్​డీఏ అనుమతులిస్తే.. నవంబర్​ తొలి వారం నుంచి చిన్నారులకు టీకా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 12 అంతకుమించిన వయస్సు వారికి ఇప్పటికే ఫైజర్​ వ్యాక్సిన్​ అందుబాటులో ఉంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు టీకా వార్త కోసం ఎదురుచూస్తున్నారు. డెల్టా వేరియంట్​ నుంచి తమ పిల్లలను రక్షించాలని, తద్వారా వారిని స్కూళ్లకు పంపించవచ్చని ఆశిస్తున్నారు.

రెండు డోసుల టీకాతో పిల్లలకు 91శాతం సామర్థ్యం లభిస్తుందని, వారిలో లక్షణాలున్న వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఫైజర్​ ఓ డేటాను విడుదల చేసింది. ఓవైపు వైరస్​ సోకిన 16మంది చిన్నారులపై డమ్మీ టీకా ప్రయోగించి, మరోవైపు టీకా తీసుకున్నా కొవిడ్​ బారినపడిన ముగ్గురు చిన్నారులపై ఈ పరిశోధనలు చేశారు. టీకా తీసుకున్న కొవిడ్​ బారిన పడిన ముగ్గురు పిల్లలపై ఈ పరిశోధన జరిగింది. పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్య కనిపించలేదు కానీ టీకా తీసుకోని వారితో పోల్చితే వ్యాక్సిన్లు తీసుకున్న చిన్నారుల్లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉందని తేలింది.

ఇదీ చూడండి:- 6 నెలల తర్వాత 80 శాతం యాంటీబాడీలు మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.