ETV Bharat / international

కరోనా కేసులు హానికరం కాదన్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపాటు - America President Donald Trump

అమెరికాలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో 99శాతం కేసులు హానికరమైనవి కాదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను ఎఫ్​డీఏ కమిషనర్​ ఖండించారు. వైరస్​ ఎంత ప్రమాదమనే విషయాన్ని ప్రభుత్వ డేటాయే స్పష్టం చేస్తోందని తెలిపారు.

FDA head rejects Trump's 'harmless' virus claim
కరోనా కేసులు హానికరం కాదన్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపాటు
author img

By

Published : Jul 6, 2020, 5:05 AM IST

Updated : Jul 6, 2020, 11:03 AM IST

కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది అమెరికా. రోజురోజుకు అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 99 శాతం వైరస్​ కేసులు ప్రమాదరకమైనవి కాదన్నారు. ట్రంప్​ వ్యాఖ్యలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కమిషనర్ డా. స్టీఫెన్​ హాన్​​ మండిపడ్డారు. వైరస్​ ఎంత హానికరమో ప్రభుత్వ వివరాలే రుజువు చేస్తున్నాయన్నారు.

'ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని తెలుసుకోవడం లేదు. కరోనా ఎంత తీవ్రమైన సమస్య అని ప్రభుత్వ డేటాయే రుజువు చేస్తోంది. ఏదేమైనా ఈ పరిస్థితి విషాదకరమైంది. పెరుగుతున్న కేసులను తగ్గించాలంటే ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు తప్పక పాటించాలి. మాస్క్​లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.' అని డాక్టర్​ స్టీఫెన్​ హాన్​ తెలిపారు.

99శాతం ప్రమాదకరం కాదు

'అమెరికా ఎక్కువ పరీక్షలు చేస్తోంది. అందువల్ల అధిక సంఖ్యలో వైరస్​ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఇందులో 99శాతం ప్రమాదకరమైనవి కావు.' అని ట్రంప్​ ఇటీవలే వ్యాఖ్యానించారు.

ట్రంప్​ మాటలను ఖండించారు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్​ మేయర్​ స్టీవ్ అడ్లెర్. ట్రంప్​ వ్యాఖ్యలే చాలా ప్రమాదకరమైనవని విమర్శించారు.

20శాతం మందిలో తీవ్రంగా వ్యాధి లక్షణాలు

కరోనా సోకిన 20 శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. అందులో న్యుమోనియా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారని తెలిపింది. స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు కనిపించని వారి వల్లే వైరస్​ అధికంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది.

ఇదీ చూడండి: చీలిక దిశగా నేపాల్​ అధికార పార్టీ!

Last Updated : Jul 6, 2020, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.