ETV Bharat / international

కరోనాపై అరుణ సిఫార్సుకు అమెరికా ఎఫ్​డీఏ ఓకే

కరోనా చికిత్సలో రెమ్​డెసివిర్ అనే యాంటీ వైరల్ వ్యాక్సిన్​ వినియోగానికి ఎఫ్​డీఏ అనుమతించింది. కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతోందని భారతీయ –అమెరికన్ నేతృత్వంలోని వైద్యుల బృందం తేల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్​డీఏ.

FDA
కరోనా చికిత్స కోసం 'రెమ్ డెసివిర్' వ్యాక్సిన్ కు ఎఫ్ డీఏ ఓకే
author img

By

Published : May 2, 2020, 11:08 AM IST

కరోనా నుంచి వేగంగా కోలుకునేందుకు సహాయపడుతోన్న యాంటీ వైరల్ వ్యాక్సిన్ రెమ్​డెసివిర్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ విభాగం (ఎఫ్​డీఏ) అనుమతించింది.

ప్రముఖ ఔషధ సంస్థ గిలియాడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన రెమ్​డెసివిర్ వ్యాక్సిన్.. కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని భారతీయ అమెరికన్ వైద్యులు అరుణ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం తేల్చింది. ఈ ఔషధం వినియోగించటం ద్వారా కొవిడ్-19 బాధితులు కోలుకునే సమయం 31 శాతం(4 రోజులు) మేర తగ్గినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెమ్​డిసివిర్ ఔషధాన్ని ఉపయోగించేందుకు ఎఫ్​డీఏ పచ్చజెండా ఊపింది.

" రెమ్​డెసివిర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు మా అధికార బృందాలు.. ఎఫ్​డీఏ, జాతీయ ఆరోగ్య విభాగం, గిలియాడ్​తో కలిసి పనిచేస్తాయి. "

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఈ ఔషధాన్ని వినియోగించటం ద్వారా సాధారణ చికిత్స తీసుకునే వారు (15 రోజులు) తో పోల్చితే 11 రోజుల్లోనే కోలుకునేందుకు వీలుపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరణాల రేటు తగ్గుతుందని భావిస్తున్నా... ప్రస్తుతం పూర్తిస్థాయిలో దీనికి ఆధారాలు లేవని చెప్పారు.

ఎఫ్​డీఏ అనుమతుల నేపథ్యంలో.. ప్రస్తుతం తమ వద్ద ఉన్న స్టాక్​ను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది గిలియాడ్. ఉత్పత్తిని వేగవంతం చేయనున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.