కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు "వియర్ ఏ మాస్క్(మాస్కు ధరించండి)" అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్. ఆంటోనీ ఫౌచీ చేసిన సూచన.. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన కొటేషన్‌గా నిలిచింది. 'ఏల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ 2020'లో ప్రథమ స్థానం సంపాదించింది.
అమెరికన్ పోలీసుల చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణిస్తూ చేసిన "ఐ కాంట్ బ్రీత్(ఊపిరి ఆడటంలేదు)" వ్యాఖ్య.. రెండో స్థానంలో నిలిచింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఎన్నికల ప్రచారంలో చేసిన "యూ ఆర్ లయింగ్ డాగ్-ఫేసెడ్ పోనీ సోల్జర్" వ్యాఖ్యలు కూడా జాబితాలో చోటు సంపాదించాయి.
ప్రతి సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన కొటేషన్స్‌ను 'ఏల్ బుక్ ఆఫ్ కొటేషన్స్'లో చేర్చుతారు. 2020 లిస్ట్‌ను ఏల్ లా స్కూల్ లైబ్రరీ అదనపు అధ్యక్షుడు ఫ్రెడ్ షాపిరో రూపొందించారు. ఈ పదాలనే తీసుకోవటానికి గల కారణాన్ని వివరించారు షాపిరో. ఆయా సందర్భాల్లో చేసిన ఈ నినాదాలు ప్రజల్లో స్ఫూర్తి నింపాయని అన్నారు.
ఇదీ చదవండి : నల్లజాతీయుడికి న్యాయం కోసం మిన్నంటిన నిరసనలు
ఇదీ చదవండి : 'వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు మానొద్దు'