ETV Bharat / international

'లాక్​డౌన్​ ఇండియా'- కరోనా కట్టడికి ఫౌచీ సూచన - ఇండియా కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులను తగ్గించేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్​ను పరిశీలించాలని సూచించారు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ. అదే సమయంలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను భారీ స్థాయిలో చేపట్టాలని పేర్కొన్నారు.

Fauci's advice to India: Clamp nationwide lockdown, go for massive vaccination drive
'లాక్​డౌన్​ ఇండియా'- కరోనా కట్టడికి ఫౌచీ సూచన
author img

By

Published : May 4, 2021, 8:14 AM IST

భారత్​లో కరోనా విజృంభణపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని అదుపు చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను విధించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ. దానితో పాటు భారీస్థాయిలో వ్యాక్సినేషన్​ చేపట్టాలని, కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు నిర్మించాలని పేర్కొన్నారు.

"భారత్​లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని అందరికి తెలుసు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్​ లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అందుకే యావత్​ ప్రపంచం భారత్​కు అండగా నిలవాల్సిన సమయం ఇది. అదే సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు ఇండియాలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను పెంచాలి. ఇలా చేస్తే కొన్ని వారాల తర్వాత పరిస్థితి చక్కపడుతుంది. ఇప్పటికిప్పుడైతే.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలి."

--- ఆంటోనీ ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణులు

సాయుధ దళాల సహాయంతో తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని ఫౌచీ అభిప్రాయపడ్డారు ఫౌచీ. గతేడాది.. చైనా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొందని, ఆ దేశం కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:- 'లాక్​డౌన్​'- కొవిడ్​ను దిగ్బంధించే వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.