ప్రాణాంతక కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ రకాలను సమర్థంగా నిరోధించే మాత్రల (పిల్స్) తయారీకి అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,745 కోట్లను (3.2 బిలియన్ డాలర్లు) కేటాయించనున్నట్లు ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ గురువారం వెల్లడించారు.
ప్రమాదకర వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వినియోగించుకునేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని, ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వస్తాయని శ్వేతసౌధం వద్ద నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: రెండు వేర్వేరు టీకా డోసులు కలపొచ్చా?