ETV Bharat / international

వివాదాస్పద పాలసీకి ఫేస్​బుక్ గుడ్​బై!

author img

By

Published : Jun 4, 2021, 1:15 PM IST

Updated : Jun 4, 2021, 1:41 PM IST

రాజకీయ నాయకుల అభ్యంతరకర ప్రసంగాలను ప్రసారం చేసేందుకు వీలు కల్పించే వివాదాస్పద పాలసీని తొలగించాలని ఫేస్​బుక్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖాతా నిలుపుదల వివాదం నేపథ్యంలో ఈ పాలసీని తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Facebook to end contentious Policy
వివదాస్పద పాలసీకి ఎఫ్​బీ గుడ్​బై

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​లో పలు నిబంధనల నుంచి రాజకీయ నేతలకు మినహాయింపు ఇచ్చే వివాదాస్పద పాలసీకి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ స్వయంగా ఈ పాలసీకి (గతంలో) దన్నుగా ఉండటం గమనార్హం.

ఏమిటి ఈ పాలసీ?

రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు సహజంగానే అభ్యంతరంగా ఉన్నా.. వాటిని ప్రసారం చేయదగ్గ సమాచారంగా గుర్తించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. దీనితో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ వాటిని ప్రసారం చేసేందుకు ఈ పాలసీ అనుమతినిస్తుంది.

అయితే ఈ పాలసీ ఉన్నప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ఈ ఏడాది జనవరి 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది ఫేస్​బుక్. క్యాపిటల్​ భవనంపై దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఖాతాను ఏం చేయాలి అనే విషయంపై మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ వివాదం నేపథ్యంలోనే రాజకీయ నాయకులకు వివాదాస్పద వ్యాఖ్యల నుంచి రక్షణనిచ్చే పాలసీని తొలగించాలని ఫేస్​బుక్ యోచిస్తున్నట్లు.. అమెరికాకు చెందిన దిగ్గజ వార్తా సంస్థలు వెర్జ్, న్యూయార్క్​ టైమ్స్​, వాషింగ్టన్​ పోస్ట్ కథనాలు ప్రచురించాయి.

నిజానికి రాజకీయ నాయకులకు మినహాయింపునిచ్చే ఈ పాలసీ 2016 నుంచే అమలులో ఉంది. అయితే 2019లో ఫేస్​బుక్​ అంతర్జాతీయ వ్యవహారాలు, కమ్యూనికేషన్ విభాగ ఉపాధ్యక్షుడు నిక్​ క్లెగ్గ్​​.. రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలను 'ప్రసారానికి యోగ్యమైన వార్త'గానే చూడాలని ప్రకటించడం వల్ల దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:Green Card: ఆ పరిమితి తొలగింపునకు బిల్లు

Last Updated : Jun 4, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.