500 మిలియన్ల ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు.. ఆన్లైన్లో కనిపించడం కలకలం రేపింది. బిజినెస్ ఇన్సైడర్ అనే ఓ మీడియా సంస్థ.. ఓ వెబ్సైట్లో ఈ సమాచారం ఉన్నట్లు వెలుగులోకి తెచ్చింది. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ చిరునామాలు ఉన్నట్లు తెలిపింది. ఈ సమాచారం పాతదే అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో యూజర్ల భద్రతపై సందేహాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
అమెరికాకు చెందిన 267 మిలియన్ల వినియోగదారుల సమాచారం.. ఆన్లైన్లో ఉన్నట్లుగా 2019 డిసెంబర్లో ఉక్రేనియన్ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించింది. అయితే.. తాజాగా లభ్యమైన ఈ సమాచారానికి దీనికి సంబంధం ఉందా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే.. ప్రస్తుతం కనిపించిన సమాచారం 2019 నాటిదేనని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019 ఆగస్టులోనే తాము దీన్ని పరిష్కరించామని చెప్పారు.
అప్పట్లో కేంబ్రిడ్జి అనలిటికా..
ఫేస్బుక్ ఎన్నో ఏళ్లుగా భద్రతా సమస్యలు ఎదుర్కొంటోంది. 87 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికాకు చెందిన ఓ రాజకీయ విభాగం అపహరించగా.. 2018లో ఓ కొత్త ఫీచర్ను ఫేస్బుక్ తీసుకువచ్చింది. దీని ప్రకారం ఫోన్ నంబర్ ద్వారా.. వినియోగదారుల సమాచారం కనిపించకుండా చేసింది.
ఇదీ చూడండి:సైనిక శిబిరాల్లో పేలుళ్లు- 15మంది మృతి