ETV Bharat / international

Zuckerberg: జుకర్​బర్గ్​ సర్ఫింగ్​పై నెటిజన్ల ట్రోలింగ్​

ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ చెరువులో అమెరికా జెండా పట్టుకుని సర్ఫింగ్​ చేశారు మార్క్​. ఆ వీడియోపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​, ట్రోల్స్​ విపరీతంగా వస్తున్నాయి.

mark surfing
మార్క్​ సర్ఫింగ్​
author img

By

Published : Jul 6, 2021, 4:10 PM IST

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం(జులై 4) నాడు ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఓ చెరువులో అగ్రరాజ్య జెండా పట్టుకుని మార్క్​ సర్ఫింగ్​ చేయగా.. ఆ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు.

సర్ఫింగ్​ చేసి...

జుకర్​బర్గ్​ జులై 4న ఓ చెరువులో ఎలక్ట్రిక్​ సర్ఫింగ్​ బోర్డుపై సర్ఫింగ్​ చేశారు. జాతీయ జెండా పట్టుకుని బ్యాలెన్స్​ చేసుకుంటూ నీటిపై దూసుకుపోయారు.

అక్కడి వరకు అంతా బాగానే సాగింది. కానీ ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన అనంతరం.. నెటిజన్లు దానిని విపరీతంగా ట్రోల్​ చేయడం మొదలుపెట్టారు. మీమ్స్​ వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి:- కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.