కెనడాలోని క్యూబెక్, ఆంటేరియో రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకుని 70 ఏళ్లు పైబడిన వ్యక్తి మరణించారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం 600 మంది సైనికులను రంగంలోకి దింపింది. వీరు సుమారు 1500 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ఇసుక సంచులు అడ్డువేసి ఇళ్లను, ఆస్తులను రక్షించుకోవడం కోసం స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి: శ్రీలంకలో మరో బాంబు నిర్వీర్యం- భయంతో జనం