ETV Bharat / international

2020 అమెరికా అధ్యక్ష పోరులో ప్రత్యేకతలెన్నో... - అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల నడుమ ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరేమో ఈ ఎన్నికలు అసాధారణమైనవని చెబుతుంటే మరికొందరేమో అత్యంత చెత్త ఎన్నికలని అంటున్నారు. అయితే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేకతలున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే ఎంతో భిన్నమైనవి. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం.

EXPLAINER: Election unprecedented some ways, in others not
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అసాధారణమైనవా?
author img

By

Published : Nov 1, 2020, 5:36 PM IST

ఇంకో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. యావత్​ ప్రపంచం అగ్రరాజ్య ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ గెలుస్తారా? డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లే మళ్లీ అధికారంలోకి వస్తారా? అనే విషయంపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అయితే అమెరికాలో మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలను కొందరు అసాధారణమైనవని అభివర్ణిస్తుంటే, మరికొందరేమో 'అత్యంత చెత్త ఎన్నికలు' ఇవే అని అభిప్రాయపడుతున్నారు.

2020 అధ్యక్ష ఎన్నికలకు గెలుపోటములతో సంబంధం లేకుండా చిరస్థాయిగా గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం.

మొదటిసారి..

  • అమెరికాలోని ఓ ప్రధాన పార్టీ.. నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి.
  • అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే ఇద్దరి అభ్యర్థుల వయసు 70ఏళ్లు దాటడం కూడా ఇదే మొదటిసారి.
  • దేశంలోని ప్రతిమూలకూ ప్రాణాంతక వైరస్ విస్తరించిన పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడమూ ఇదే ప్రథమం.

ఇదీ చూడండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇంత సంక్లిష్టమా?

1918 తర్వాత..

స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు 1918లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్ శాతం ఏకంగా 20 శాతం తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 20 లక్షల మంది పాల్గొనడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి మరో కారణం. ఆ తర్వాత 1920 ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్ జీ హార్డింగ్ విజయం సాధించారు. ఫ్లూ ముప్పును అమెరికా అధిగమించింది.

ముందస్తు ఓటింగ్​..

కరోనా నేపథ్యంలో ఊహించని మార్పుతో ఈ ఎన్నికల్లో బ్యాలెట్​ ఓటింగ్​కు ముందుగానే అనుమతించింది ప్రభుత్వం. దీంతో తుది ఫలితాలు రావడానికి పలు వారాల ముందే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి: అన్నింటా బద్ధవైరం.. ఇద్దరూ మందుకు దూరం!

ఎన్నికల రోజు రాత్రే..

నవంబరులో ఎన్నికలు జరిగిన రాత్రే తమ తదుపరి అధ్యక్షుడు ఎవరని తెలుసుకునేందుకు అలవాటు పడ్డారు అమెరికా ప్రజలు. 1937 వరకు మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. అధ్యక్షుడి ప్రమాణం మార్చిలో జరిగేది. ఓట్లను లెక్కించేందుకు చాలా సమయం పట్టేది. అందుకే ఫలితాలు ఆలస్యమయ్యేవి.

2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కూడా డిసెంబరు 12 వరకు తేలలేదు. ఫ్లోరిడా ఓట్ల లెక్కింపును ఆపాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. జార్జి డబ్ల్యూ బుష్​ను విజేతగా ప్రకటించింది.

ట్రంపే మొదటి అధ్యక్షుడు..

అధికారంలో ఉండి బ్యాలెట్​ ఓటింగ్​ను తీవ్రంగా వ్యతిరేకించిన మొదటి అధ్యక్షుడిగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. ఈ విధానం వల్ల ఎన్నికల ప్రక్రియలో మోసాలు జరిగే అవకాశాలున్నాయన్నది ఆయన వాదన.

ఇదీ చూడండి: ఈ రాష్ట్రాలు ఎటువైపు 'స్వింగ్' అవుతాయి?

ప్రచారంలో వ్యత్యాసం..

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో జోరును కొనసాగించారు ట్రంప్. ప్రతిపట్టణంలో మెరుపు ర్యాలీలు నిర్వహించారు.

బైడెన్​ మాత్రం చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యారు. తాను, తన మద్దతుదారులు ఎక్కడ కరోనా బారినపడతారో అని తక్కువ ర్యాలీల్లో పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థి ప్రచారంలో ఎక్కువగా పాల్గొనకపోవడం ఇటీవలి కాలంలో చాలా అరుదుగా జరిగింది.

అయితే 19 శతాబ్దంలో ఏ గార్ఫీల్డ్​, బెంజమిన్ హారిసన్​, విలియమెకిన్లే , 20 శాతాబ్దంలో హర్డింగ్​ కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికీ ర్యాలీల్లో పాల్గొనలేదు. ఇంటి వద్ద నుంచే ప్రచారం నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.