ETV Bharat / international

ప్రముఖ ప్రవాస భారతీయ​ ఫిజీషియన్​ లోధా మృతి - అజయ్​లోధా కన్నుమూత

ప్రముఖ భారత అమెరికన్​ వైద్యుడు అజయ్​ లోధా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత ఎనిమిది నెలలుగా వైరస్​తో పోరాడిన ఆయన.. ఈ నెల 21న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ అసోసియేషన్​ ఆఫ్​ నార్త్​ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అజయ్​ మృతిపై.. రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె సహా.. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Indian-American physician Ajay Lodha passes away
ప్రముఖ ప్రవాస భారతీయ​ ఫిజీషియన్​ అజయ్​ లోధా మృతి
author img

By

Published : Nov 24, 2020, 9:12 AM IST

Updated : Nov 24, 2020, 9:34 AM IST

ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజీషియన్​ అజయ్​ లోధా(58) కొవిడ్​-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. భారత సంతతి ఫిజీషియన్ల సంస్థ(ఆపి) మాజీ అధ్యక్షుడైన అజయ్.. ఎనిమిది నెలల కిందట కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21 మృతి చెందారు.

ప్రముఖుల సంతాపం..

ప్రతిష్ఠాత్మక ఇల్లిస్​ ఐలాండ్​ పతకం 2016లో లోధాను వరిచింది. రాజస్థాన్ అసోసియేషన్​ ఆఫ్​ నార్త్​ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అజయ్​ మృతిపై.. న్యూయార్క్​లోని భారత కాన్సులేట్​ జనరల్​, రాజస్థాన్​ మాజీ సీఎం వసుంధర రాజె, బీఎస్​ఎఫ్​ మాజీ డైరెక్టర్​ జనరల్​ కేకే శర్మతో పాటు చాలా మంది ప్రముఖ ప్రవాస భారతీయులు సంతాపం తెలిపారు. వీరిలో ఆపి అధ్యక్షుడు సుధాకర్​ జొన్నలగడ్డ, ఆపి అధ్యక్షురాలిగా ఎన్నికైన డాక్టర్​ అనుపమ గోటిముకుల, ఉపాధ్యక్షుడు డా. రవి ఉన్నారు. వైద్యుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు.

ఇదీ చదవండి: అమెరికాలో మహిళను పట్టాలపైకి తోసిన భారతీయుడు

Last Updated : Nov 24, 2020, 9:34 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.