వేలాది మంది నిరసనకారులు ఈక్వెడార్ రాజధాని క్విటోలో శనివారం ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ భవనాలకు నిప్పు అంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిరసనకారులపై బాష్ప వాయువును ప్రయోగించారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 1200 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 30 మందిని అరెస్టు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనబాట పట్టారు. గత 11 రోజులుగా చేస్తోన్న నిరసనలను నిలిపివేయాలంటూ ఈక్కెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో కోరారు. క్విటోలో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా ఉండేందుకే కర్ఫ్యూ విధించినట్లు వెల్లడించారు. క్విటోలో 75వేల మంది సైనికులు మోహరించి అల్లర్లును అదుపు చేశారు.
నిరసనలకు కారణం...
ఈక్వెడార్ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 11 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు ఈక్వెడార్ వాసులు.
ఇదీ చూడండి:తుపాను ధాటికి జపాన్ విలవిల- 11 మంది బలి