ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు క్రైస్తవులు ప్రార్థనాలయాలకు తరలివెళుతున్నారు. మతబోధకులు క్రీస్తు బోధనలను వినిపిస్తున్నారు. మందిరాలన్నీ కిక్కిరిసిపోయాయి.
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా వద్ద పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయ వేడుకలకు వచ్చిన వారందరినీ ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజలందరూ మనోస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు పోప్. ఆరోగ్యం, ఉన్నతమైన భవిష్యత్తు, జీవితంలో గౌరవం వీటన్నింటికీ మూలకారకుడైన ఏసుక్రీస్తుపై నమ్మకం ఉంచాలని సూచించారు.
ఇటీవలే భారీ అగ్ని ప్రమాదానికి గురైన పారిస్‌లోని ప్రఖ్యాత 'నోటర్ డామ్' చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు పునరుత్థాన దినం సందర్భంగా వేలాదిమంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.