ETV Bharat / international

6.1 తీవ్రతతో భూకంపం- చర్చి ధ్వంసం - ఎర్త్​క్వేక్​ పెరూ

పెరూ ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ఓ చర్చి పైకప్పు ధ్వంసమైంది. ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.

earthquake in peru
పెరూలో భూకంపం
author img

By

Published : Jul 31, 2021, 7:23 AM IST

పెరూ ఉత్తర పసిఫిక్​ తీరాన్ని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. సులానా నగరానికి తూర్పు దిశగా 8 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

భూకంపం ప్రభావంతో సులానా నగరంలో చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు. ఓ గోడ కూలి కారుపై శిథిలాలు పడగా.. అందులో ఉన్న ఓ మహిళకు గాయాలయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఓ చర్చి పైకప్పులో కొంతభాగం కూలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు.. స్థానిక టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. మరో రెండు ప్రార్థనా మందిరాలు సహా మూడు అగ్నిమాపక కేంద్రాలు కూడా ధ్వంసమైనట్లు ఆ వీడియోల్లో కనిపించాయి.

earthquake in peru
సుల్లానా నగరంలో కూలిన చర్చి పైకప్పు

భూకంప ధాటికి ప్రభావితమైన పియురా నగరంలో సహాయ చర్యల కోసం సైన్యాన్ని పంపినట్లు ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో క్యాస్టిలో కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చూడండి: పెగసస్​ వ్యవహారంపై ఇజ్రాయెల్​ దర్యాప్తు షురూ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.