కరీబియన్ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని హైతీ సివిప్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మరోవైపు.. అమెరికాలోని అలస్కాలో కూడా భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలదని స్పష్టం చేసింది. పెరీవిల్లీ ఆనే ప్రాంతానికి సమీపంలో భూకంపం ఏర్పడినట్లు తెలిపింది. జనావాసాలకు 135 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి : కాబుల్‌కు 70 కి.మీ దూరంలో తాలిబన్లు- ఏ క్షణమైనా...