అలస్కాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. హోమర్ నుంచి ఫైర్ బ్యాంక్స్ నగరాల వరకు భూమి స్వల్పంగా కంపించింది. ముఖ్యంగా ఎంకరేజ్, వాసిల్లా నగరాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించిందని అధికారిక దినపత్రికలు తెలిపాయి. ఎంకరేజ్ నగరానికి ఉత్తరాన ఉన్న టాల్కీత్నా పర్వతాలు కంపించాయి.
44 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని కెనడా భూకంప కేంద్రం వెల్లడించింది. సోమవారం రోజూ భూమి స్వల్పంగా కంపించిందని తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా సమాచారం లేదు.
ఇదీ చదవండి: 550 మిలియన్ డాలర్లు ఇస్తేనే ఆ నౌక రిలీజ్!