అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళుతోంది స్పేస్ఎక్స్. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐసీఎస్)లోని వ్యోమగాములకు క్రిస్మస్ బహుమతులతో పాటు, పరిశోధన పరికరాలతో కూడిన సరికొత్త, అతిపెద్ద డబుల్ డ్రాగన్ నౌకను నింగిలోకి పంపింది. దీని ద్వారా తొలిసారి రెండు క్యాప్సుల్స్‌ను ఒకేసమయంలో పంపించిన ఘనత సాధించింది.
-
Tracking footage from a helicopter of today’s Falcon 9 launch off LC-39A pic.twitter.com/7rYVZRTS18
— SpaceX (@SpaceX) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tracking footage from a helicopter of today’s Falcon 9 launch off LC-39A pic.twitter.com/7rYVZRTS18
— SpaceX (@SpaceX) December 7, 2020Tracking footage from a helicopter of today’s Falcon 9 launch off LC-39A pic.twitter.com/7rYVZRTS18
— SpaceX (@SpaceX) December 7, 2020
నాసాకు చెందిన కెన్నెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ పాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ కొత్త డ్రాగన్ నౌకను అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. వ్యోమగాముల క్రిస్మస్ విందు కోసం కాల్చిన టర్కీ, కార్న్ బ్రెడ్ డ్రెస్సింగ్, క్రాన్బెర్రీ సాస్, షార్ట్ బ్రెడ్ కుకీలు, ఐసింగ్ గొట్టాలను తీసుకువెళుతోంది డ్రాగన్. ఈ నౌక సోమవారం(నేడు) మధ్యాహ్నం ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. నెలరోజుల పాటు అక్కడే ఉండనుంది.
"మీరు చూస్తున్న ప్రతిచోట డ్రాగన్స్ ఉంటాయి. నాసా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్న క్రమంలో.. అంతరిక్ష కేంద్రంలో ఎల్లప్పుడూ ఒక డ్రాగన్ క్యాప్సుల్ ఉండాలని స్పేస్ఎక్స్ భావిస్తోంది. ఈ ప్రయోగం మొత్తం.. నాసా వ్యోమగామి కేట్ రుబిన్స్కు క్రిస్మస్ బహుమతిగా చేపట్టిందే."
- కెన్నీ టోడ్, నాసా, అంతరిక్ష కేంద్ర ప్రోగ్రామ్ డిప్యూటీ మేనేజర్.
డ్రాగన్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి సుమారు 6,400 పౌండ్లు (2,400కిలోలు) వస్తువులు పంపారు. అందులో బిలియన్ల కొద్ది సూక్ష్మజీవులు (మాక్రోబ్స్), బయోమైనింగ్ అధ్యయనం కోసం పిండిచేసిన గ్రహశకల నమూనాలు, వ్యోమగాముల రాపిడ్ బ్లడ్ టెస్ట్ కోసం కొత్త కిట్టు, కళ్లు, ఎములపై ప్రయోగాలు చేసేందుకు 40 ఎలుకలను ఇందులో పంపారు.
గత నెలలో నలుగురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపించింది స్పేస్ఎక్స్. నాసా కోసం 2012 నుంచి అంతరిక్ష కేంద్రానికి 21 ప్రయోగాలు చేపట్టింది స్పేస్ ఎక్స్.
ఇదీ చూడండి:నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక