ETV Bharat / international

'అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలని లేదు.. కానీ' - అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

అధ్యక్ష ఎన్నికలు కాస్త ఆలస్యమవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ట్వీట్​పై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తన ట్వీట్​కు స్పష్టతనిచ్చారు ట్రంప్​. ఎన్నికలు వాయిదా పడాలని తాను కోరుకోవడం లేదని.. తానీ మెయిల్​-ఇన్​ ఓటింగ్​ లెక్కింపు మాత్రం ఆలస్యమయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

Don't want to delay election, but results may take 'years' with mail-in voting: Trump
'అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలని లేదు.. కానీ'
author img

By

Published : Jul 31, 2020, 10:43 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలని తాను కోరుకోవడం లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. అయితే మెయిల్​-ఇన్​ ఓటింగ్​ లెక్కింపు మాత్రం కొన్ని వారాల సమయం పట్టొచ్చని, దీని వల్ల ఫలితాల్లో అవకతవకలు జరగొచ్చని పేర్కొన్నారు. నవంబర్​ 3న జరగనున్న ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగొచ్చన్న తన ట్వీట్​పై రాజకీయ దుమారం చెలరేగడం వల్ల ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్​.

"ఎన్నికలను వాయిదా వేయాలని నాకు లేదు. ఎన్నికలు జరగాలని నాకూ ఉంది. అదే సమయంలో మూడు నెలలు వేచిచూసి.. బ్యాలెట్లు కనపడటం లేదని తెలుసుకోవాలని నాకు లేదు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

మెయిల్​-ఇన్​ ఓటింగ్​లో అవకతవకలు జరగవచ్చని ట్రంప్​ ఆరోపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడానికి ఇదొక సులభమైన మార్గమని అభిప్రాయపడ్డారు.

అయితే డెమొక్రాట్లు మాత్రం మెయిల్​-ఇన్​ ఓటింగ్​కే పట్టుబడుతున్నారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలోని అమెరికన్లు కూడా పోలింగ్​ బూత్​లకు బదులు ఈ మెయిల్​-ఇన్​ ఓటింగ్​వైపే మొగ్గుచూపే అవకాశముంది.

'నేనే గెలుస్తా...'

అధ్యక్ష ఎన్నికల కోసం అందరికన్నా ఎక్కువగా తానే ఎదురుచూస్తున్నట్టు తెలిపారు ట్రంప్​. తనకు వ్యతిరేకంగా వస్తున్న పోల్స్​ అసత్యమని.. ఈసారి కూడా కచ్చితంగా తానే గెలుస్తానని మరోమారు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- భారత్​-చైనాకు ఆ విషయం పట్టదు: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.