ETV Bharat / international

ఆస్పత్రి సేవలకు ఫిదా- సిబ్బందికి రూ.7.5 కోట్లు కానుక - 1 million dollors donation news

కరోనాపై పోరులో వైద్యుల సేవలను మెచ్చి ఓ ఆస్పత్రికి మిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఇంతటి భారీ కానుకతో ఆస్పత్రిలోని సిబ్బంది సంతోషంలో మునిగి తేలుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించినుందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Donor gives employees at hospital $1 million for bonuses
వైద్యుల సేవలకు మెచ్చి ఆస్పత్రికి మిలియన్​ డాలర్ల కానుక
author img

By

Published : May 4, 2020, 3:41 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు వైద్యులు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు వైద్య సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కాలిఫోర్నియాలోని సాంటా క్రూజ్​లో ఓ అజ్ఞాతవ్యక్తి మాత్రం వైద్యసిబ్బందికి ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నాడు. స్థానిక ఆస్పత్రికి ఒక మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.

'దేశ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు' అని విరాళంతో పాటు ఓ నోట్​ను ఉంచారు గుర్తు తెలియని వ్యక్తి. అహర్నిశలు శ్రమిస్తున్న తమకు మానవతా దృక్పథంలో ఆ వ్యక్తి చేసిన సాయం సంతోషాన్నిస్తోందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.

ఈ కానుకను ఆస్పత్రి వైద్య, సహాయ సిబ్బంది అందరం పంచుకుంటామని, వారి నైపుణ్యాలకు లభించిన బహుమానంగా దీనిని స్వీకరిస్తున్నట్లు డొమినికన్​ ఆస్పత్రి ప్రెసిడెంట్ డా.ననిట్టి మికీవిజ్​ తెలిపారు. వైద్య సిబ్బందికే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నా, ఆస్పత్రిని శుభ్రంగా ఉంచే సహాయ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్​ లేకపోతే మెరుగైన సేవలు అందించడం సాధ్యం కాదన్నారు.

మిలియన్​ డాలర్ల విరాళాన్ని ఆస్పత్రి సిబ్బందికి బోనస్​గా ఇవ్వనున్నారు. ఏడాది కాలంగా అక్కడ పనిచేస్తున్న ఫుల్​టైమ్​ సిబ్బందికి 800 డాలర్లు, పార్ట్​ టైమ్​ సిబ్బందికి 600 డాలర్లు కానుకగా లభించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.