ETV Bharat / international

సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

అగ్రరాజ్య సెనేట్​లో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై రెండో అభిశంసన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జనవరి 6న జరిగిన క్యాపిటల్​ హింసాకాండలో ట్రంప్​ తన మద్దతుదారులను ప్రేరేపించారా? అన్న కోణంలో ఈ అభిశంసన ప్రక్రియ జరగనుంది.

donald-trumps-second-impeachment-trial-opens-in-the-senate-first-for-an-ex-president-ap
సెనేట్​ ముందుకు ట్రంప్ రెండో​ అభిశంసన
author img

By

Published : Feb 10, 2021, 1:24 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను అభిశంసించే తీర్మానం మంగళవారం(స్థానిక కాలమానం) సెనేట్​ ముందుకు వచ్చింది. చట్టసభల నిలయమైన క్యాపిటల్​ హిల్​ భవనంపై జనవరి 6న దాడి జరిగేలా తన మద్దతుదార్లను రెచ్చగొట్టారన్నది ట్రంప్​పై ఉన్న ఆరోపణ.

ఓ మాజీ అధ్యక్షుడు అభిశంసన ఎదుర్కొనడం.. అమెరికా చరిత్రలోనే తొలిసారి. మొత్తం మీద ట్రంప్​ అభిశంసనను ఎదుర్కొనడం ఇది రెండోసారి.

అభిశంసనకు సంబంధించిన తీర్మానం గత నెలలో ప్రతనిధుల సభలో గట్టెక్కింది. అయితే ప్రతినిధుల సభకు కేవలం అభిశంసించే అధికారం ఉండగా.. సెనేట్​కు విచారణ జరిపి, శిక్ష విధించే అధికారం కూడా ఉంది.

క్యాపిటల్​పై దాడిని ట్రంప్​ సొంతపార్టీ అయిన రిపబ్లికన్​ సభ్యులు అప్పట్లో ఖండించగా, ప్రస్తుతం వారు మెత్తపడ్డారు. పదవి నుంచి దిగిపోయినందున మళ్లీ శిక్ష ఎందుకున్న భావన వారిలో ఉన్నారు. ఈ తరుణంలో ట్రంప్​ అభిశంసన కథ ఎక్కడికి చేరుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:- ట్రంప్​కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.