జే బర్రెట్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. అతడు కిస్టిక్ ఫిబ్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటున్నాడు. అతడి సోదరి బ్రిడ్గేట్ డెమొక్రటిక్ పార్టీ స్థానిక నాయకురాలు. ఆమె ఓ వీడియో ఫేస్బుక్లో షేర్ చేశారు. తన సోదరుడికి ట్రంప్ ఫోన్ చేశారని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఫోన్ సంభాషణ వీడియో స్పష్టంగా వినిపిస్తోంది.
"నీవూ నాలాంటి వాడివే. నీ పట్ల గర్వంగా ఉంది. వ్యాధితో పోరాడుతూనే ఉండు. మనమిద్దరం పోరాడదాం. నేను మళ్లీ మాట్లాడతా." అని ట్రంప్ జే బర్రెట్తో అన్నారు.
ఏదేమైనా నేను మీకు మద్దతుగానే ఉంటానని బర్రెట్ సమాధామిచ్చారు.
"త్వరలో నువ్వు ర్యాలీలో పాల్గొంటావని ఆశిస్తున్నా" అన్న ట్రంప్ మాటలకు స్పందించాడు బెర్రెట్. "నేను మృతి చెందేలోగా వాషింగ్టన్ రావాలని అనుకుంటున్నా. 2020 అధ్యక్ష ఎన్నికల్లో మీకే ఓటేయాలని ఆశిస్తున్నా" అని బర్రెట్ అన్నాడు.
ఫోన్లో మాటలు పూర్తయ్యాక "నేను మాట్లాడింది అమెరికా అధ్యక్షుడితోనేనా" అంటూ బర్రెట్ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశాడు.