అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది(trump taekwondo). ఆయనను 9వ ర్యాంక్ డాన్ బ్లాక్ బెల్టుతో సత్కరించింది దక్షిణ కొరియా దిగ్గజ మార్షల్ ఆర్ట్స్ సంస్థ కుక్కివొన్. ప్రపంచ తైక్వాండో ప్రధాన కార్యాలయమైన ఈ సంస్థ అధ్యక్షుడు లీ డాంగ్ సియోప్.. అమెరికా ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసానికి వెళ్లి ఈ అవార్డును స్వయంగా అందజేశారు. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ట్రంప్‌కు తైక్వాండో పట్ల ఆసక్తి ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ట్రంప్-డాంగ్ సియోప్ భేటీని అమెరికాలో నివాసముంటున్న దక్షిణ కొరియా వ్యక్తి ఏర్పాటు చేశారు.
బ్లాక్ బెల్టు అందుకున్న అనంతరం ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు(trump honorary black belt). వెంటనే బెల్టు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ గౌరవం తనకు దక్కినందకు ఆనందంగా ఉందన్నారు. ఆత్మరక్షణకు తైక్వాండో గొప్ప మార్షల్ ఆర్ట్ అని ప్రశంసించారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే ఈ బ్లాక్ బెల్టు ధరించి కాంగ్రెస్‌కు హాజరవుతానని పేర్కొన్నారు. కుక్కివోన్ అధ్యక్షుడు బహూకరించిన తైక్వాండో దుస్తులపై ట్రంప్ సంతకం కూడా చేశారు(trump taekwondo award).
పుతిన్‌కు దీటుగా..
ట్రంప్ కంటే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఇదే బ్లాక్బెల్టుతో సత్కరించింది దక్షిణ కొరియా. 2013లో ఆయన ఆ దేశ పర్యటనకు వెళ్లినప్పుడు తైక్వాండో గ్రాండ్ మాస్టర్‌గా కూడా ప్రకటించింది.
ట్రంప్ నివాసంలోని గోడపై పలు ఆసక్తికర ఫొటోలు దర్శనమిచ్చాయి(donald trump news). ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను 2019లో పన్ముంజోమ్లో కలిసిన ఫొటోతో పాటు బ్రిటన్ రాణిని కలిసిన చిత్రాలు ఉన్నాయి. మెలానియా ట్రంప్‌తో ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ను కలిసేందుకు వెళ్లిన ఫొటో కూడా ఆకర్షణీయంగా ఉంది.
ఇదీ చదవండి: క్రిస్మస్ ఊరేగింపుపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి