ETV Bharat / international

క్యాపిటల్ హింసాకాండలో పైపు బాంబులు - ట్రంప్ అమెరికా క్యాపిటల్

క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో పలు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ​లోని రిపబ్లికన్, డెమొక్రటిక్ నేషనల్ కమిటీ కార్యాలయాలకు సమీపంలో వీటిని కనుగొన్నారు. అనంతరం బాంబులను నిర్వీర్యం చేశారు.

Discovery of pipe bombs in DC obscured by riot at Capitol
క్యాపిటల్ హింసాకాండలో పైపు బాంబులు
author img

By

Published : Jan 12, 2021, 5:32 PM IST

అమెరికా పార్లమెంట్ భవనంపై గత బుధవారం జరిగిన దాడిలో బాంబులు సైతం ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఓవైపు హింసాకాండ కొనసాగుతున్న సమయంలో.. భద్రతా దళ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైనట్లు తాజాగా తేలింది. వాషింగ్టన్​ డీసీలోని రిపబ్లికన్, డెమొక్రటిక్ నేషనల్ కమిటీల కార్యాలయాలకు అతిసమీపంలోనే రెండు పైపు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Discovery of pipe bombs in DC obscured by riot at Capitol
పోలీసులు గుర్తించిన పైపు బాంబు

బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు క్యాపిటల్ పోలీసులు, ఎఫ్​బీఐ, సహా సహాయక బృందాలు రిపబ్లికన్​ నేషనల్ కమిటీకి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. ముప్పై నిమిషాల తర్వాత అదే తరహా పరికరం డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు చెప్పారు. ఈ రెండు పరికరాలు ఒకే విధంగా ఉన్నాయని, బాంబులకు టైమర్​ను సైతం అమర్చారని తెలిపారు. అందులో గుర్తుతెలియని పౌడర్, లోహాలు ఉన్నట్లు తెలిపారు. వాటి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: క్యాపిటల్ దాడిలో నేరస్థులు- నిస్సహాయంగా పోలీసులు

మరోవైపు, ఆందోళనల సందర్భంగా క్యాపిటల్ భవనం వద్ద నిలిపి ఉంచిన ఓ ట్రక్కులో.. లోడ్ చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్, 11 సీసా బాంబులు లభించినట్లు తెలిపారు. ఇళ్లలోనే ఈ బాంబులను తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ట్రక్కు యజమానిని అరెస్టు చేశారు.

బైడెన్ ప్రమాణస్వీకారానికి వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వాషింగ్టన్​లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పటిష్ఠ భద్రత లేని ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలే లక్ష్యంగా దాడి జరగొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 'బైడెన్​ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.