ETV Bharat / international

జార్జి ఫ్లాయిడ్​ హంతకుడికి 22 ఏళ్ల జైలు శిక్ష - జార్జి ఫ్లాయిడ్​ హత్య కేసు

నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్​ హంతకుడు, మాజీ పోలీస్​ అధికారి డెరిక్​ చౌవిన్​కు స్థానిక కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 15 ఏళ్ల శిక్ష తర్వాత నిందితుడికి పెరోల్​కు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

george floyd murder case verdict
జార్జి ఫ్లాయిడ్​ హంతకుడికి 22 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Jun 26, 2021, 3:34 AM IST

Updated : Jun 26, 2021, 4:24 AM IST

అమెరికా నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ మరణానికి కారణమైన మాజీ పోలీస్​ అధికారి డెరిక్ చౌవిన్​​కు 22.5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది మినియాపొలిస్ కోర్టు. చౌవిన్ సత్ప్రవర్తనను కనబరిస్తే​ 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత అతనికి పెరోల్​కు అనుమతించవచ్చని స్పష్టం చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాల్లో ఉన్నట్టు 12.5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్​ విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ విధంగా తీర్పునిచ్చింది.

ఏడాదిగా స్పందించని చౌవిన్​.. విచారణ సందర్భంగా ఫ్లాయిడ్​ కుటుంబానికి సంతాపం తెలిపాడు. 'ఫ్లాయిడ్​ కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను. కాలం మీకు మనశ్సాంతి కలిగిస్తుందని ఆశిస్తున్నాను' అని చౌవిన్​ పేర్కొన్నాడు.

అంతకుముందు.. విచారణను వాయిదా వేయాలన్న చౌవిన్​ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

ఇదీ చదవండి : Florida building collapse: శిథిలాల కింద 159 మంది!

Last Updated : Jun 26, 2021, 4:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.