ETV Bharat / international

ఈ ఏడాది ప్రజాస్వామ్యానికే పరీక్ష ఎదురైంది: బైడెన్​ - జో బైడెన్​ థ్యాంక్స్​ గివింగ్

ప్రజాస్వామ్యమే అమెరికా హృదయ స్పందన అని జో బైడెన్ అన్నారు. ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందని, కరోనా వైరస్‌ కమ్ముకున్న సమయంలో కూడా రికార్డు సంఖ్యలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని అమెరికా ప్రజలు తీర్పును వెలువరించారని కొనియాడారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఇచ్చిన ‘థ్యాంక్స్‌గివింగ్‌’ ప్రసంగంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Democracy was tested this year, people up to the task: Biden
బైడెన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు
author img

By

Published : Nov 26, 2020, 11:40 AM IST

ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు. కరోనా వైరస్‌ కమ్ముకున్న సమయంలో కూడా రికార్డు సంఖ్యలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని అమెరికా ప్రజలు తీర్పును వెలువరించారన్నారు. బుధవారం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఇచ్చిన ‘థ్యాంక్స్‌గివింగ్‌’ ప్రసంగంలో బైడెన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రరాజ్యంలో ప్రతి సంవత్సరం నవంబర్‌లో జరుపుకొనే ఈ థ్యాంక్స్‌గివింగ్ కార్యక్రమంలో.. ప్రజలకు, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేయటం సంప్రదాయం. కాగా, కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ వీటన్నిటికీ తోడు ఈసారి ప్రజాస్వామ్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.

ప్రజాస్వామ్యమే అమెరికా హృదయ స్పందన అని బైడెన్‌ ఈ సందర్భంగా అన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రజలను కరోనా అనేక పరీక్షలకు గురిచేసిందని.. 2 లక్షల 60 వేల మంది అమెరికన్లను బలితీసుకుందన్నారు. ఈ ఏడాది ఎంతో బాధకు, నష్టానికి, ఆవేదనకు కారణమైందని.. మనను విడదీయాలని చూసిందన్నారు. అయితే, అమెరికా ప్రజలు ఇందుకు దీటుగా నిలబడ్డారని బైడెన్‌ అన్నారు. నిన్నటి కంటే ఈ రోజు బాగుంటుందని, ఇక రేపు అనే రోజు మరింత బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ప్రజాస్వామ్యానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. అయితే యుద్ధం చేయాల్సింది కొవిడ్‌-19తో కానీ, మనలో మనం కాదన్నారు. బలమైన సంకల్పంతో ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, కర్తవ్యం పట్ల పునరంకితం కావాలని జో బైడెన్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: బ్లింకెన్​ ఎంపికతో భారత్​కు లాభమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.