ETV Bharat / international

విమానం నుంచి పడిన వస్తువులు- తప్పిన ముప్పు - విమానానికి భారీ ప్రమాదం తప్పింది

అమెరికాలోని ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఇంజన్​ విఫలం కావడం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా విమానం నుంచి కొన్ని వస్తువులు కింద పడ్డాయి. అయితే విమానం సురక్షితంగానే దిగిందని అధికారులు తెలిపారు.

Us Plane Emergency Landing
విమానం కేబిన్​లో భారీ పేలుడు
author img

By

Published : Feb 21, 2021, 11:09 AM IST

విమానం నుంచి కింద పడిన వస్తువులు

అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ముప్పు తప్పింది. విమానం కుడి ఇంజన్ విఫలం కావడం వల్ల.. డెన్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఈ సమయంలో విమానం నుంచి కొన్ని వస్తువులు కింద పడడం కలకలం రేపింది. విమానం నుంచి పడిన వస్తువులు కింద ఉన్న కొన్ని నివాస గృహాల ముందర పడ్డాయి. ఇళ్లపైనా, మనుషులపైనా వస్తువులు పడకపోవడం వల్ల ముప్పు తప్పింది.

విమానాశ్రయంలో విమానం సురక్షితంగానే దిగిందని, ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. విమానం డెన్వర్‌ నుంచి హొనొలులుకు వెళుతుండగా.. ఇంజిన్‌ చెడిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం బయలుదేరిన కాసేపటికే భారీ కుదుపులకు గురికాగా, కేబిన్‌లో భారీ పేలుడు జరిగినట్లు పైలెట్‌ మైకులో ప్రయాణికులకు తెలిపాడు.

పొగలు కక్కుతూ తక్కువ ఎత్తులో ఎగిరిన విమానం తిరిగి డెన్వర్ విమానాశ్రయంలో దిగింది. విమానం కుదుపులకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడతామని.. తాము అనుకోలేదని, సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు తెలిపారు.

ఇదీ చూడండి: కూలిన మిలటరీ శిక్షణ విమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.