ఇప్పటివరకు ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్య ప్రకటనలే చూసిన మనకు ఈ ప్రకటన కాస్తా కొత్తగానే ఉంటుంది. అత్త కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేయాలనుకున్న ఓ కోడలు ఏకంగా ఓ వైబ్సైట్లో ప్రకటన ఇచ్చేసింది.
విషయం ఏంటంటే..
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ కోడలు.. తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్ ఫ్రెండ్‌గా అద్దెకు కావాలని క్రెయిగ్స్లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యింది.
51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది.
అయితే అతడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలని షరతు విధించింది కోడలు. ఈ ప్రకటనపై చమత్కారంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ఇదీ చూడండి: ప్రియుడు చెప్పాడని.. ఆ పని చేసిన ప్రేయసి- చివరికి..