ETV Bharat / international

చిలీ నిరసనలు హింసాత్మకం- ఎమర్జెన్సీ విధింపు - చిలీ నిరసనలు హింసాత్మకం

చిలీలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మెట్రో టికెట్‌ రేట్లను పెంచడంపై ప్రజలు వరుసగా రెండో రోజు నిరసనలు చేపట్టారు. పలు మెట్రో స్టేషన్లు, బస్సులను ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని నిలువరించేందుకు అత్యయిక పరిస్థితి విధించారు ఆ దేశ అధ్యక్షుడు సెబాస్టియన్​ పినేరా.

చిలీ నిరసనలు హింసాత్మకం.. ఎమర్జెన్సీ విధింపు
author img

By

Published : Oct 20, 2019, 9:44 AM IST

Updated : Oct 20, 2019, 10:11 AM IST

చిలీ నిరసనలు హింసాత్మకం

చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచడంపై ప్రజాగ్రహం హింసగా మారింది. పలు నగరాల్లో వరుసగా రెండో రోజు ప్రజలు నిరసనలు చేపట్టారు. కొన్ని మెట్రో స్టేషన్లను ధ్వంసం చేశారు. భారీగా బస్సులను తగలబెట్టారు.

అత్యయిక స్థితి..

గంట గంటకూ ప్రజల్లో ఆందోళనల స్థాయి పెరిగిపోవడం.. విధ్వంసం జరుగుతున్నందున.. అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించడానికి కారణం శాంతి భద్రతల పరిరక్షణ అని.. ప్రజల భద్రతే ముఖ్యమని పినేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

15 రోజుల పాటు..

దేశంలో ఎమర్జెన్సీ ప్రాథమికంగా 15 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడానికి వీల్లేదు. గుమిగూడి ప్రదర్శనలు చేయడం కూడా నిషేధం. ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ వారాంతంలో జరగాల్సిన ఫుట్ బాల్ మ్యాచ్‌లను జాతీయ ఫుట్ బాల్ అసోసియేషన్ రద్దు చేసింది.

ఇదీ చూడండి: హాంకాంగ్ నిరసనలు... మాస్క్​లతో మానవహారం

Cuttack (Odisha), Oct 20 (ANI): Odisha Police arrested 12 people for manufacturing illegal firecrackers in Cuttack's Jagatpur. Police also busted eight illegal firecracker manufacturing units in the area. "Overall 8 teams were formed to conduct raids. During the raids, eight houses were detected where this illegal manufacturing was going on," Cuttack's Deputy Commissioner of Police Akhileshwar Singh said. However, further investigation is underway to ascertain from where the raw material was being supplied to these illegal units

Last Updated : Oct 20, 2019, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.