ETV Bharat / international

టీకా తీసుకున్న కరోనా​ రోగుల్లో వైరల్​ లోడు తక్కువే!

author img

By

Published : Jul 2, 2021, 7:16 AM IST

వ్యాక్సిన్​ పొందిన తర్వాత కరోనా సోకిన వారికి వైరల్​ లోడు తక్కువగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. రెండు డోసులు పొందినవారికి కరోనా నుంచి 91 శాతం, ఒకే డోసుతో 81 శాతం మేర రక్షణ లభిస్తున్నట్లు తేల్చారు.

corona vaccine viral load, study on covid vaccine
టీకా పొందిన కొవిడ్​ బాధితుల్లో తక్కువగా వైరల్​ లోడు

టీకా పొందాక కూడా కొవిడ్‌-19 బారిన పడినవారిలో వైరల్‌ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధరించారు. ప్రస్తుతం కరోనాకు మంచి టీకాలు వచ్చాయి. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకోవడంలో అవి సమర్ధంగానే పనిచేస్తున్నాయి. అయితే ఏ టీకాకూ వంద శాతం సమర్థత ఉండదు. పొందాక కూడా ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. 'టీకా వల్ల దాదాపు 90 శాతం మేర కొవిడ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌ బారినపడినా.. అతడిలో వైరస్‌ తక్కువగానే ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా ఒక మోస్తరుగానే ఉంటుంది' అని ఆరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకుడు జెఫ్‌ బర్జెస్‌ పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 14 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 10 వరకు అమెరికాలో 3,975 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందిన ఐదుగురికి, పాక్షికంగా టీకా పొందిన 11 మందికి, వ్యాక్సిన్‌ పొందని 156 మందికి కొవిడ్‌ సోకింది. టీకా పొందని వారితో పోలిస్తే.. పాక్షికంగా లేదా వూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందినవారిలో వైరల్‌లోడు 40 శాతం తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో కొవిడ్‌తో పాటు జ్వరం వచ్చే అవకాశం 58 శాతం తక్కువని తేలింది. రెండు డోసులు పొందినవారికి కరోనా నుంచి 91 శాతం, ఒకే డోసుతో 81 శాతం మేర రక్షణ లభిస్తున్నట్లు తేల్చారు.

ఇదీ చదవండి : 'అలా చేస్తేనే కరోనాపై విజయం సాధ్యం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.