ETV Bharat / international

అమెరికా చట్టసభలో చైనాపై ఆంక్షల బిల్లు - అమెరికా చైనా సంబంధాలు

కరోనా విషయంలో దర్యాప్తునకు అంగీకరించాలని చైనాపై అమెరికా రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. తాజాగా కొంతమంది సెనేటర్లు అమెరికా కాంగ్రెస్​లో చైనాకు వ్యతిరేకంగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కరోనా వ్యాప్తికి చైనా జవాబుదారీగా వ్యవహరించకపోతే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించేలా ఈ బిల్లు రూపొందించారు.

VIRUS-US-CHINA-LEGISLATION
అమెరికా చట్టసభలో చైనాపై ఆంక్షల బిల్లు
author img

By

Published : May 13, 2020, 11:04 AM IST

చైనాపై ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని అమెరికా ప్రతినిధుల సభలో 9 మంది కీలక సెనేటర్లు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కరోనా విపత్తుకు సంబంధించి చైనా జవాబుదారీగా వ్యవహరించకపోతే ఈ చర్యలు తీసుకునేలా 'ద కొవిడ్-19 అకౌంటబిలిటీ' ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని లిండ్సే గ్రహమ్​ నేతృత్వంలోని ఈ సెనేటర్ల బృందం కోరింది.

"చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా అమెరికాకు వైరస్​ వచ్చి ఉండేది కాదు. వుహాన్​ ల్యాబ్​లో దర్యాప్తు చేసేందుకు అంతర్జాతీయ సమాజానికి చైనా అనుమతి ఇవ్వటం లేదు. ఈ వైరస్​ వ్యాప్తి ఎలా మొదలైందన్న విషయాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులనూ రానివ్వటం లేదు. ఇటువంటి చర్యలు తీసుకోకుండా చైనా మాట వినదు. విచారణకు అంగీకరించే వరకు ఈ కఠిన ఆంక్షలు చైనాను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి."

- లిండ్సే గ్రహమ్​, అమెరికా సెనేటర్

కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించటంపై చైనా కమ్యూనిస్టు పార్టీ బాధ్యత వహించాలని లిండ్సే డిమాండ్​ చేశారు. వెట్ మార్కెట్ల వల్ల అనేక రకాల అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని.. వాటిని మూసివేయాల్సిందేనని ఆయన అన్నారు.

ఈ ప్రతిపాదన ప్రకారం..

అమెరికా దాని మిత్ర దేశాలు లేదా ఐరాస అనుబంధ సంస్థలతో కరోనా వ్యాప్తికి సంబంధించి ఏదైనా విచారణకు చైనా అంగీకరించాలి. ఈ విచారణలో తేలిన విషయాలకు చైనా జవాబుదారీగా ఉండాలి. వైరస్​ వ్యాప్తికి కారణమవుతోన్న చైనాలోని అన్ని వెట్​ మార్కెట్లు (వన్యప్రాణి మాంస విక్రయశాలలు) మూసివేయాలి. అమెరికా అధ్యక్షుడి ధ్రువీకరణ తర్వాత విచారణకు సంబంధించి పూర్తి వివరాలు అమెరికా కాంగ్రెస్​కు సమర్పించాలి. ఈ తతంగమంతా 60 రోజులలోపు జరగాలి.

ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే చైనాపై ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం లభిస్తుంది. ఆస్తులను స్తంభింపజేయటం, ప్రయాణాలపై నిషేధం, వీసా రద్దు, చైనా వ్యాపారాలకు అమెరికా బ్యాంకుల రుణాల నిరాకరణ, అమెరికా స్టాక్​ మార్కెట్ల నుంచి చైనా కంపెనీల తొలగింపు వంటి చర్యలు తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: '20 ఏళ్లలో చైనా నుంచి 5 మహమ్మారులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.