ప్రపంచ దేశాలను కుదుపేసిన కరోనా మహమ్మారి కారణంగా.. సుమారు 15 నుంచి 17.5 కోట్ల మంది తీవ్ర పేదరికం అనుభవించే అవకాశముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వర్చువల్గా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు మానవ హక్కుల ప్రత్యేక రిపోర్టర్ ఆలివర్ డీ ష్కట్టర్.
తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయేవారిలో.. అసంఘటిత రంగం వారే ఎక్కువగా ఉంటారని చెప్పారు ఆలివర్. వారిలో మహిళలే అధికమని అంచనా వేశారు. పర్యావరణంపై ఆధారపడి జీవనోపాధి సాగించేవారు ఎక్కువగా ప్రభావితమవుతారని ఆయన స్పష్టం చేశారు.
1929 నాటి తీవ్ర ఆర్థిక మాంద్యం లాగే.. ఈసారీ ఆర్థిక వృద్ధిని గణించేందుకు వీలుకాదని ఆలివర్ పేర్కొన్నారు. అయితే.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సుస్థిర పర్యావరణం, సామాజిక న్యాయం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
ఇదీ చదవండి: 2021 నాటికి కడు పేదరికంలో 15 కోట్ల మంది!