ETV Bharat / international

కరోనా కాలంలో ఓసీడీ 'మహానుభావుల' పరిస్థితి ఇలా... - Covid-19 pandemic in india

కరోనా భయాలతో అందరూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. కానీ సాధారణ రోజుల్లోనూ అత్యంత శుభ్రతను పాటించే బృందం ఒకటుంది. అదే ఓసీడీ గ్రూప్. ప్రస్తుతం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, ఆందోళనలు, వాటికి విశ్లేషణాత్మక పరిష్కారాలు మీ కోసం.

ocd on corona pandemic
కరోనా కాలంలో ఓసీడీ 'మహానుభావుల' పరిస్థితి ఇలా...
author img

By

Published : Apr 5, 2020, 1:41 PM IST

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్.. క్లుప్తంగా చెప్పాలంటే ఓసీడీ. ఇలా చెబితే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ మహానుభావుడు చిత్రం గుర్తుందా? కథానాయకుడు శానిటైజర్​తో ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. అన్నీ సక్రమంగా ఉండాలంటాడు. ఈ అతిశుభ్రతా ధోరణికి ఓసీడీ అని పేరుపెట్టింది వైద్య శాస్త్రం. ఇదో మానసిక రుగ్మత అని తేల్చింది. సాధారణంగానే అతిశుభ్రతను పాటించే ఈ రుగ్మత ఉన్నవాళ్లకు ప్రస్తుత కరోనా కాలంలో కాస్త కష్టమే. వారిలోని అతి భయాలను సంతృప్తి పరిచేందుకు నేటి రోజుల్లో వారు పడే పాట్లు.. వాటికి పరిష్కారాలపై ఓ లుక్కేద్దాం.

కొంతమందిలోనే ఓసీడీ పెరుగుదల..

ఓసీడీ ఉన్నవాళ్లు సాధారణంగానే అతిశుభ్రతను పాటిస్తారు. నేటి కరోనా కాలంలో శుభ్రతను పాటించేందుకు వీరు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైరస్​ సమయంలో ఓసీడీ కలిగినవారి మానసిక స్థితిపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు మెక్లీన్ ఓసీడీ ఇన్సిటిట్యూట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నతానియేల్ వాన్​క్రిక్.

ప్రస్తుత పరిస్థితి కొంతమందిలో ఓసీడీని తీవ్రం చేస్తుందని వివరించారు వాన్​క్రిక్. కొద్దిగా అనారోగ్యంగా ఉండటం.. ఇతరులకు ముప్పుగా పరిణమించకూడదనే భావన.. ఓసీడీ ఉన్నవారిలో శుభ్రత ఆలోచనల్ని మరింత పెంచుతుందని తెలిపారు వాన్​క్రిక్.

అయితే ఓసీడీ ఉన్న మరికొంతమంది రోగులు తమలో కొవిడ్-19 భయాలు లేదని చెప్పారని పేర్కొన్నారు వాన్​క్రిక్. వారిని భయపెట్టే అంశాల్లో వైరస్ లేదని.. వారికున్న ఇతర భయాలతో పోల్చితే దీని స్థాయి తక్కువని వెల్లడించారు.

కరోనా భయాలతో ఇబ్బందులు..

ఓసీడీతో బాధపడే వారిలో కరోనా భయాలుంటే మాత్రం వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వాన్​క్రిక్ పరిశోధన తేల్చింది. చేతులు కడుక్కోవడం వల్ల వైరస్​ను ఎదుర్కోవచ్చనే మార్గదర్శకాలతో శుభ్రతలో మరింత అతి చేస్తారని వెల్లడించింది. చేతులు శుభ్రంగా ఉంచుకునే విషయంలో సీడీసీ వంటి సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఓసీడీతో ఉన్నవారు అతి శుభ్రతను.. మరింత జాగ్రత్తగా పాటిస్తారని వెల్లడించారు వాన్​క్రిక్. అతి శుభ్రతతో ఇంకా సురక్షితంగా ఉండవచ్చని భావిస్తారని చెప్పారు. దీనికి కారణం వారిలో ఉన్న ఆందోళన, ఏం జరుగుతుందోనన్న భయాలేనని వివరించారు.

ఒకే సూచన అమలు సరికాదు..

ఓసీడీ ఉన్నవారు ఒకే శుభ్రత మార్గదర్శకాన్ని పాటించి మిగతా వాటి వదిలేసే అవకాశం కూడా ఉందని విశ్లేషించారు వాన్​క్రిక్. ఓసీడీ కారణంగా వారు ఒకే అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తారని పేర్కొన్నారు. సంప్రదాయాలు అభివృద్ధి చెందేందుకు ఇది ఓ ఉదాహరణని పేర్కొన్నారు. ఆందోళన, భయాల నుంచి బయటపడేందుకు ఓసీడీ ఉన్నవారికి ఇదో మార్గంగా ఎంచుకుంటారని తెలిపారు.

వార్తల కారణంగా..

మహమ్మారికి సంబంధించిన వార్తలు కూడా ఓసీడీ ఉన్నవారిలో సమస్యలకు కారణమవుతాయని వాన్​క్రిక్ వెల్లడించారు. 'ఓసీడీ ఉన్నవారు ఒక సమాచారాన్ని మాత్రమే గ్రహిస్తారు. మిగతా సమాచారాన్ని పట్టించుకోరు. ఓ శీర్షికనో, కథనాన్నో పట్టుకుని భయాలు సృష్టించుకుంటారు' అని పేర్కొన్నారు. వార్తల వల్ల వచ్చే ఈ భయాల నుంచి బయటపడేందుకు విశ్వనీయ వార్తలను మాత్రమే చదవాలని సూచించారు వాన్​క్రిక్.

"నేటి రోజుల్లో సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి విశ్వసనీయ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే నమ్మాలి. అయితే ఆయా మార్గదర్శకాలను పాటిస్తే 100 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లు కాదు. మనకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గదర్శకాలనే మనం పాటిస్తున్నామని గుర్తించాలి."

-వాన్​క్రిక్, ఓసీడీ వైద్యుడు

సాధారణ ప్రజలకు అవగాహన దిశగా..

ఓసీడీపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరోనా వైరస్ ఉపకరిస్తోందని పేర్కొన్నారు వాన్​క్రిక్. ఓసీడీ ఉన్నా, లేకపోయినా తాము చూసే దృష్టిలో ప్రజలు సమతూకం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి: చైనాలో 'దొంగ కరోనా' కేసుల్లో పెరుగుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.