ETV Bharat / international

కొవిడ్​ లక్షణాలు మూడు రకాలు - కరోనాపై పరిశోధనలు

కరోనా సోకిన వారిని మూడు రకాలుగా వర్గీకరించారు అమెరికన్​ శాస్త్రవేత్తలు. బాధితుల్లోని ఆరోగ్య సమస్యలు, చికిత్సకు వారు స్పందించే తీరు ఆధారంగా విభజించిన పరిశోధకులు.. రానున్న కాలంలో ప్రమాదం పొంచి ఉన్న బాధితులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.

COVID-19 patients can be categorised into three groups
కొవిడ్​ లక్షణాలు మూడు రకాలు
author img

By

Published : Apr 5, 2021, 8:54 AM IST

కొవిడ్​ బాధితులను మూడు భిన్న కేటగిరీలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగుల్లోని ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, చికిత్సకు వారు స్పందించే అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. భవిష్యత్తులో అత్యంత ఎక్కువ ముప్పు పొంచి ఉన్న బాధితులకు ప్రత్యేక చికిత్సా విధానాల అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు.. గతేడాది మార్చి 7 నుంచి ఆగస్టు 25 మధ్యలో కరోనా పాజిటివ్​గా తేలిన 7,358 మంది రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్​ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వీరిలో 1,022 మందికి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది.

బాధితుల్లో 60 శాతం మందిని ఫెనోటైప్​-2గా వర్గీకరించారు. 23 శాతం మందిని ఫెనోటైప్​-1గా గుర్తించారు. వీరికి గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. 16.9 శాతం మందిని ఫెనోటైప్​-3 బాధితుల్లో శ్వాస సంబంధాలు రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఫెనోటైప్​-3తో పోలిస్తే.. ఫెనోటైప్​-1 వారిలో మరణం ముప్పు 7.3 రెట్లు ఎక్కువని.. ఫెనోటైప్​-2 బాధితుల్లో అది 2.57 రెట్లు అధికమని వివరించారు. ఆయా ఫెనోటైప్​లకు అనుగుణంగా చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తే రోగులు కోలుకోవడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి: 'నిర్లక్ష్యం చేస్తే మరోసారి కొవిడ్ విజృంభణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.