ETV Bharat / international

ఆ వేరియంట్​తో మరోసారి కొవిడ్ విజృంభణ.. ఫౌచీ హెచ్చరిక - ఆంటోనీ ఫౌచీ

COVID-19 Cases: కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలోని శ్వేతసౌధం ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ. ఒమిక్రాన్‌ ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అగ్రరాజ్యంలో మరోసారి కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.

anthony fauci latest covid news
BA.2 subvariant
author img

By

Published : Mar 22, 2022, 5:54 AM IST

COVID-19 Cases: పలు దేశాల్లో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిన వేళ అమెరికాలోని శ్వేతసౌధం ముఖ్య ఆరోగ్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ రాబోయే రోజుల్లో ఆ దేశంలో వైరస్ విజృంభనపై హెచ్చరికలు జారీ చేశారు. ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్ బీఏ.2 కారణంగా అమెరికాలో మరోసారి కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఉప వేరియంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని తెలిపారు.

ఒమిక్రాన్‌తో పోలిస్తే ఇది 60శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, అయితే దీనివల్ల తీవ్ర ప్రభావం ఏమీ ఉండదని ఫౌచీ స్పష్టం చేశారు. అమెరికాలో నమోదయ్యే కొత్త కేసుల్లో ఈ ఉప వేరియంట్ రకానికి చెందినవే 30శాతం ఉంటాయని తెలిపారు. అగ్రరాజ్యంలో అత్యంత ప్రభావం చూపే వేరియంట్‌గా బీఏ.2 నిలుస్తుందని ఫౌచీ అన్నారు. ఈ కొత్త రకం వేరియంట్ కారణంగానే చైనా సహా ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ఇదీ చూడండి: ba2 omicron: బీఏ.2 వేరియంట్ కలకలం.. 54 దేశాల్లో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.