కరోనా వైరస్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి విషయంలో ఓటర్లు అనూహ్యంగా ప్రవర్తించారు. అమెరికాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రంప్‌కు భారీ మద్దతు లభించటం ఆశ్చర్యకరం.
తలసరి కొత్త కేసులు అత్యధికంగా ఉన్న 376 కౌంటీలలో 93 శాతం ఓట్లు ట్రంప్‌కే పడ్డాయని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) విశ్లేషించింది. వీటిలో చాలా వరకు డకోటా, మోంటానా, నెబ్రాస్కా, విస్కాన్సిన్, అయోవాలోని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
వివిధ ప్రాంతాల్లో ఏపీ చేసిన సర్వేలో.. ట్రంప్ ఓటర్లలో 36 శాతం మంది కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. మరో 47 శాతం మంది తటస్థంగా ఉందన్నారు. బైడెన్ ఓటర్లలో మాత్రం 82 శాతం మంది వైరస్ నియంత్రణలోకి రాలేదన్నారు.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా వైరస్ కొత్త రికార్డులు