ETV Bharat / international

కరోనా మరణాలు 37వేలపైనే.. స్పెయిన్​లో విజృంభణ

ప్రపంచంపై కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తోందీ మహమ్మారి. స్పెయిన్​లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. మృతులు, కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో అక్కడ 913 మంది మరణించారు. ఇటలీలో సోమవారం 812 మంది వైరస్​ ధాటికి బలయ్యారు. అమెరికాలో 573 మందికి మరణించారు. ఫ్రాన్స్​లో ఒక్కరోజు మృతుల సంఖ్య 400 మించింది.

Coronavirus deaths top 35,000 worldwide, most in Europe: AFP tally
కరోనా ఉగ్రరూపం.. ఫ్రాన్స్​, స్పెయిన్​లో విజృంభణ
author img

By

Published : Mar 31, 2020, 5:11 AM IST

Updated : Mar 31, 2020, 8:08 AM IST

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలపై మరింత వేగంగా విస్తరిస్తోంది. కేసులు, మరణాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య 37 వేలు దాటింది. కేసులు 8 లక్షలకు చేరువయ్యాయి. ఐరోపా దేశాల్లో కరోనా ప్రతాపం అధికంగా ఉంది. అక్కడ మరణాల సంఖ్య 27 వేలపైనే నమోదైంది.

coronavirus-deaths-top-35000-worldwide-most-in-europe-afp-tally
అమెరికాలో ఒక్కరోజులో 20వేలకుపైగా కేసులు

స్పెయిన్​లో...

ఈ దేశంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ 913 మంది కరోనాకు బలయ్యారు. మరో 7846 మంది బాధితులతో కేసుల్లో చైనాను మించింది. అక్కడ మొత్తం వైరస్​ సోకిన వారి సంఖ్య 88 వేలకు సమీపంలో ఉంది.

కరోనా విజృంభణ తీవ్రమవుతున్న దృష్ట్యా స్పెయిన్​ ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ప్రజల్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో వారికి అత్యవసర అధికారాల్ని కట్టబెట్టింది.

ఇటలీ..

ఇటలీలో మరణాలు తీవ్రంగానే ఉన్నప్పటికీ కేసుల వ్యాప్తి రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం మరో 812 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 11 వేల 591కి చేరింది. 4050 కొత్త కేసులు నమోదుకాగా.. మొత్తం లక్ష దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​ను ఏప్రిల్​ 12 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది.

సోమవారం రికార్డు స్థాయిలో 1590 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని.. మొత్తం 14 వేల మందికిపైనే కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారని అధికారులు స్పష్టం చేశారు.

అమెరికాలో ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు...

అగ్రరాజ్యం అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మరో 573 మందికి ప్రాణాలు విడిచారు. నిన్న 20 వేలకుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. మొత్తం బాధితులు లక్షా 63 వేలు దాటారు. ఎక్కువభాగం న్యూయార్క్​ వాసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు వారాల్లో దేశంలో మరణాల రేటు పెరుగుతుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్​ పేర్కొనడం వైరస్​ ఉద్ధృతికి అద్దం పడుతోంది.

ఫ్రాన్స్​...

అమెరికా తర్వాత ఫ్రాన్స్​లోనూ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు దాదాపు రెట్టింపవడం గమనార్హం. మరో 418 మంది మరణించగా.. మొత్తం మృతులు 3024కి చేరారు. కేసుల సంఖ్య 44 వేల 550గా ఉంది.

దేశంలో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గణాంకాలు ఆసుపత్రుల్లో మరణించినవారివి మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు అధికారులు. వృద్ధాశ్రమాలు, ఇళ్లల్లో మరణించినవారిని అధికారిక లెక్కల్లోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

మిగతా దేశాల్లో...

యూకేలో 2600కుపైగా కొత్త కేసులతో మొత్తం బాధితులు 22వేలకుపైమాటే. మరో 180 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 1400 దాటింది.

కోలుకున్న యువరాజు...

కొవిడ్​ బారిన పడ్డ బ్రిటన్​ యువరాజు చార్లెస్​(71) కోలుకున్నారు. వైద్యులను సంప్రదించిన అనంతరం... ఆయన స్వీయనిర్బంధం నుంచి బయటికొచ్చారని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్​లో సోమవారం 117 మంది మరణించగా.. కేసులు 40 వేలను దాటాయి.

ఒక్కరోజు వ్యవధిలో జర్మనీలో 104, నెదర్లాండ్స్​లో 93, బెల్జియంలో 82, స్విట్జర్లాండ్​లో 59 మరణాలు నమోదయ్యాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని ఆమె ప్రతినిధి వెల్లడించారు. అయినా మెర్కెల్‌ గృహ నిర్బంధంలోనే ఉంటారని తెలిపారు.

నెతన్యాహు స్వీయనిర్బంధం..

మాస్కోలో లాక్‌డౌన్ విధించిన పుతిన్ సర్కారు.. ప్రజలు సహకరించాలని కోరింది. ఈ ఆంక్షలతో అక్కడ 1.2 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహాయకుడికి కరోనా పాజిటివ్ రాగా ముందస్తు జాగ్రత్తగా ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

పాక్​లో లాక్​డౌన్​ కష్టం...

పాకిస్థాన్‌లో మరో ఏడుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. కేసులు 17వందలు దాటింది. దేశంలో వైరస్​ వేగంగా వ్యాపిస్తన్నా... లాక్‌డౌన్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. తమదేశంలో 25 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని లాక్‌డౌన్‌ విధిస్తే వాళ్లు ఆకలితో చనిపోతారని వెల్లడించారు.

Last Updated : Mar 31, 2020, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.