ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి ధాటికి గడగడలాడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 32 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 5లక్షల 75 వేల మందికిపైగా మహమ్మారికి బలైపోయారు.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 65,488 కేసులు, 465 మరణాలు నమోదయ్యాయి.
- బ్రెజిల్లో వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజులో మరో 21,783 కేసులు నమోదుకాగా.. 770 మంది మరణించారు.
పరిస్థితి మరింత దిగజారుతుంది..
కరోనా వైరస్ను నియంత్రించే.. ప్రాథమిక నిబంధనలు పాటించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు.
"నేను నిర్మొహమాటంగా చెబుతున్నాను. చాలా దేశాలు తప్పుడు దిశలో పయనిస్తున్నాయి. కరోనా వైరస్ మానవాళికి ప్రథమ శత్రువుగా ఉంది. వైరస్ నివారణ చర్యలను పాటించకపోతే పరిస్థితులు మరింత క్షీణిస్తాయి."
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
.
ఇదీ చూడండి: 'రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేయవచ్చు'