ETV Bharat / international

నొప్పిని హరిస్తున్న కరోనా వైరస్​! - కరనా వైరస్ నొప్పి

కరోనా వైరస్​తో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుండొచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమని పరిశోధకులు పేర్కొన్నారు. ఇన్​ఫెక్షన్​ బారినపడిన 50శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడానికి ఇదే కారణమై ఉండొచ్చని తెలిపారు.

corona virus giving relief from pain
నొప్పిని హరిస్తున్న కరోనా వైరస్​!
author img

By

Published : Oct 5, 2020, 8:18 AM IST

కరోనా వైరస్​ కారణంగా నొప్పి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వ్యాప్తిలో సగం మేర.. వ్యాధి లక్షణాలు ప్రారంభం కావడానికి ముందే జరిగిపోతాయి. కొవిడ్​-19 ఇన్​ఫెక్షన్లలో 40శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించటంలేదు.

"వ్యాధి ప్రారంభ దశలో బాధితుడిలో ఎలాంటి లక్షణాలు ఉండటంలేదు. అందువల్ల అతడు అంతా బాగుందనుకొని స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇందుకు కారణం అతడిలో నొప్పి.. అణచివేతకు గురికావటమే" అని పరిశోధనలో పాలుపంచుకున్న రాజేశ్​ ఖన్నా తెలిపారు.

కొవిడ్​-19 కారణంగా శరీరంలో తొలుత నొప్పి రూపంలో తలెత్తే లక్షణాన్ని కరోనా వైరస్​లోని స్పైక్​ ప్రొటీన్ తగ్గిస్తుండొచ్చని చెప్పారు. శరీరంలోని నొప్పి సంకేతాలకు సంబంధించిన మార్గాలను ఇది నిశ్శబ్దం చేస్తుందని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.