మూడో త్రైమాసికంలో కొవిడ్-19 సోకిన గర్భిణుల్లో యాంటీబాడీలు తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు అంతగా బదిలీ కావడం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇన్ఫ్లుయెంజా, కోరింత దగ్గు సోకిన వారికి యాంటీబాడీలు సాధారణంగానే బదిలీ అవుతున్నాయి. సార్స్-కోవ్-2 విషయంలో మాత్రం అంతగా యాంటీబాడీలు తల్లి నుంచి పిండానికి చేరడం లేదని, చేరినా అవి అంతగా ప్రభావం చూపడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గర్భిణులకు టీకా ఎప్పుడు వేయాలన్న అంశం చాలా కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మూడో త్రైమాసికంలో మాత్రమే ఈ యాంటీబాడీల బదిలీ సక్రమంగా జరగడం లేదన్న విషయం తమ అధ్యయనంలో స్పష్టమైందని చెబుతున్నారు. గర్భిణులకు టీకా తయారుచేసే వారికి తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్(ఎంజీహెచ్)తో కలసి నిర్వహించిన ఈ అధ్యయనాన్ని 'సెల్' జర్నల్ ప్రచురించింది.
ఇదీ చదవండి: ఆక్స్ఫర్డ్ టీకా జనవరి తొలివారంలో?